Prabhas: ఆదిపురుష్ సినిమా మొదలైనప్పటి నుంచి హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వీరి ప్రేమ గురించి, పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరి జంట సీతారాములుగా నటిస్తోంది. ఆన్ స్క్రీన్ లో ఇంత అందంగా కనిపించే వీరు ఆఫ్ స్క్రీన్ లో కూడా పెళ్లితో ఒక్కటి కానున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై కృతి స్పందించింది. తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
తెలుగు తెరపై ఈ చిన్నది మహేష్ బాబుకు జోడీగా వన్..నేనొక్కడినే అనే సినిమాలో కనిపించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ అనే సినిమా చేసింది. అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఢిల్లీలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.
తాజాగా కృతి సనన్ ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమాలో సీతమ్మగా కనిపించనుంది. ప్రభాస్, కృతి సనన్ పై గత కొన్ని రోజులుగా గాసిప్స్ వస్తున్నాయి. ప్రభాస్ తో ఈ అమ్మడు డేటింగ్ చేస్తోందని, వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో వీరి లవర్ ఎఫైర్ రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. తనకు, ప్రభాస్ కు అటువంటి ఫీలింగ్స్ లేవని, తమ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది. ఇటీవలె ఓ ఇంటర్య్యూలో ఆమె మాట్లాడుతూ..ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ అని, తనతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. ‘ఆదిపురుష్’ సెట్‌లో తనకు ప్రభాస్ తెలుగు బాగా నేర్పించారని తెలిపింది. తన పెళ్లిపై కూడా ఈ చిన్నది క్లారిటీ ఇచ్చింది. తనకన్నా పొడవుగా, అందంగా ఉండేవాడు, తనను ఎప్పుడూ సంతోషంగా చూసుకునేవాడ్ని త్వరలోనే పెళ్లిచేసుకుంటానని తెలిపింది.