Prabhas: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా?

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. బాహుబలి, సాహో సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశాడు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు ప్రభాస్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానే. అతడి సినిమా రూ.100కోట్ల బడ్జెట్ లేకుండా తెరకెక్కడం లేదు. దర్శక నిర్మాతలు సైతం ప్రభాస్‌తో సినిమా తీయాలి అంటే రూ.100కోట్లకు పైగానే బడ్జెట్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి అతడికి కోట్లలో ఆస్తి ఉందని ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో ఏకంగా 84 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎంత నిజం ఉందన్న సంగతి పక్కనబెడితే అసలు ఈ వార్తలు ఎలా పుట్టాయి అన్న విషయం ఆసక్తి రేపుతోంది.

బాహుబలి, సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలతో ఉత్తరాదిలో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అక్కడి మీడియా సెలబ్రిటీలపై క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ప్రభాస్ గురించి ఇష్టమొచ్చినట్లు రాసింది. జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాలు అంటే ఎంటో తెలియకుండా ఓ కథనాన్ని రాసి వైరల్ చేసింది అక్కడి మీడియా. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభుయార్లగడ్డ, మారుతి లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ కథనంపై స్పందించి బాలీవుడ్ మీడియాకు చీవాట్లు పెట్టారు. నిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీల గురించి వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడ్డారు.

ప్రభాస్‌కు అసలు ఎంత ఆస్తి ఉంది?
జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాల్లో విలాసవంతమైన ఫాంహౌస్ లేకపోయినా ప్రభాస్‌కు ఉన్న ఆస్తి తక్కువేమీ కాదని టాక్. ప్రభాస్ తండ్రి సత్యనారాయణ రాజు చెన్నై, బెంగళూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేశారు. అంతేకాకుండా పెద్దనాన్న కృష్ణంరాజు కూడా నటుడిగా, నిర్మాతగా రాణించి వారసుడు ప్రభాస్‌కు షేర్ ఇచ్చారు. అలా ప్రభాస్‌కు ప్రస్తుతం రూ.7వేల కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -