Aadipurush: ఫ్లాప్ అని కామెంట్లు చేసేవాళ్లకు ఆదిపురుష్ తో ప్రభాస్ నోరు మూయుస్తాడట.. కానీ?

Aadipurush: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో చాలామంది అగ్రస్థాయి డైరెక్టర్లు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాగా ప్రభాస్ చేతినిండా ఆఫర్లతో మూడు పువ్వులు ఆరు కాయలు లా కెరీర్ పరంగా దూసుకు వెళుతున్నాడు. ఇక ఆదివారం రోజున ప్రభాస్ ఆది పురుష్ సినిమా టీజర్ విడుదల చేశారు.

కాగా ఈ ఈ సినిమా టీజర్ ప్రభాస్ అభిమానులను భారీ స్థాయిలో నిరాశపరిచింది. టీజర్ ఓవరాల్ గా యానిమేషన్ గ్రాఫిక్స్ ను కనబరిచింది. మరికొందరు ఈ సినిమా కార్టూన్ సినిమా లా ఉందని ఈ టీజర్ ను మరో స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా టీజర్ విడుదలైన తర్వాత ఆ సినిమాకు మరింత అంచనాలు పెరగాలి కానీ.. ఆది పురుష్ సినిమా మాత్రం చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సినిమా పూర్తిగా ప్లాప్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు.

ఇక ఆది పురుష్ సినిమా పై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నా సినిమా రిలీజ్ అయ్యే సమయానికి పరిస్థితులు మారుతాయి అని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అభిమానులు చెబుతున్నారు. కానీ కమర్షియల్ గా మరీ సంచలనాలను సృష్టిస్తుందని మేము అనుకోవడం లేదని ప్రభాస్ అభిమానులు ఇప్పుడు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఇలా చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రభాస్ కూడా టీజర్ విషయం లో చాలా వరకు నిరుత్సాహం చెందినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా డైరెక్టర్ ఓం రౌత్ మీద ప్రభాస్ ఆగ్రహం చెందినట్లు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో లీక్ అయినట్లు తెలుస్తుంది. మరి త్వరలో వరల్డ్ వైడ్ గా విడుదల కాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టు కుంటుందో చూడాల్సిఉంది. కానీ ఈ సినిమా ప్లాప్ అని ట్రోల్ చేసేవారిని ఆది పురుష్ తో ప్రభాస్ నోరు మూయిస్తాడని అభిమానులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -