Prabhas: లుక్‌పై ఫోకస్ చేసిన ప్రభాస్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వింటేనే అభిమానులలో తెలియని ఉత్సాహం రెట్టింపు అవుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఇలా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టి ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి ఆది పురుష్ సినిమా షూటింగ్ పనులు పూర్తీ కాగా ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అదేవిధంగా ఈయన సలార్, ప్రాజెక్టు కే వంటి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ గత రెండు సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచారు.

ఇక సినిమా పరంగా జయప్రజయాలు పక్కన ఉంచితే ప్రభాస్ అభిమానులను ఒక విషయంపై తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లుక్ పూర్తిగా మారిపోయిందని,ప్రభాస్ అధిక శరీర బరువు పెరగటం వల్ల తన ఫేస్ లో గ్లో తప్పిపోయింది అంటూ అభిమానులు చాలా ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఆయన ఎంత వీలైతే అంత తన లుక్ పై ఫోకస్ పెడితేనే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు భావించారు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం పలు కార్యక్రమాల ద్వారా ప్రభాస్ బయట కనిపించినప్పటికీ ఆయన లుక్ లో ఎలాంటి మార్పు లేకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.అయితే తాజాగా సీతారామం ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ప్రభాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. ప్రభాస్ తాము కోరుకున్న లుక్ మైంటైన్ చేస్తున్నారని యధావిధిగా ఈయన లుక్ మునుపటిలాగే ఉందని అభిమానులు సంతోష పడుతున్నారు. ఇలా అభిమానుల కోసం ప్రభాస్ తనని తాను పూర్తిగా మార్చుకోవడం చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -