Prabhas: మళ్లీ చనిపోయే పాత్రలో ప్రభాస్.. అలా ప్లాన్ చేశారా?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా స‌లార్ అనే సినిమా రూపొందుతోంది. దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సలార్ సినిమా గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోంది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమాను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌లార్ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

 

ఈ సినిమాలో ప్ర‌భాస్‌ కు విల‌న్ గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ల‌పై ఇప్పటికే కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. వీరిద్దరి మధ్య పోరాట ఘ‌ట్టాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించినట్లు తెలుస్తోంది. స‌లార్ సినిమాలో వ‌ర‌ద‌రాజా మ‌న్నార్ అనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ నటిస్తుండటం అందర్నీ ఆకర్షిస్తోందని చెప్పాలి. అత‌డి పాత్ర ప‌రిచ‌యానికి సంబంధించిన స‌న్నివేశాల‌ను ఇప్పటికే చిత్రీకరించారు.

 

స‌లార్‌ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తుండగా జ‌గ‌ప‌తిబాబు కూడా ఓ కీల‌క పాత్రలో కనిపిస్తున్నారు. 2023లో ఈ సినిమాను విడుదల చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నారు. కేజీఎఫ్‌-2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తోన్న భారీ చిత్రంగా ఇది రూపొందుతోంది. కేజీఎఫ్‌ సినిమాను తీసిన హోంబ‌లే ఫిల్మ్స్ సంస్థ స‌లార్ సినిమాను కూడా దాదాపు రెండు వంద‌ల కోట్ల వ్యయంతో నిర్మిస్తుండటం విశేషంగా చెప్పొచ్చు.

 

తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ లీక్ అయ్యిందని తెలుస్తోంది. సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర బాహుబలిలో కట్టప్ప రోల్ లా ఉంటుందని సమాచారం. మళ్లీ ప్రభాస్ చనిపోయే పాత్రలో కనిపించారని, ఆ పాత్ర ట్విస్ట్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. మొత్తానికి ఇది నిజమా కాదా అని తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -