Prabhas: ప్రభాస్ కాలిగోటికి కూడా సరిపోరు.. మీకు అర్థమవుతోందా?

Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్ రాజ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమా అన్నీ పాన్ ఇండియా లెవన్ మూవీస్ మాత్రమే చేస్తున్నారు. బాలీవుడ్ ను తన అడ్డాగా మార్చుకున్నాడు. అయితే ఒక సౌత్ ఇండియన్ హీరో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ని విస్తరించుకుంటూ పోవడం ఎందరికో మింగుడు పడటం లేదు.

ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు ఈ కారణంగానే బాహుబలి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు మిగులుతున్నాయి.టి సిరీస్ లాంటి దిగ్గజ నిర్మాణ సంస్థ తన మీద వరసగా నాలుగు సినిమాలు ప్లాన్ చేసుకుని ఏకంగా మూడు వేల కోట్ల దాకా పెట్టుబడి సిద్ధపడటం గతంలో ఏ ఖాన్లకు జరగలేదు.అంతెందుకు లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఇంత వైభవం చూడలేదన్నది వాస్తవం.అందుకే ఈ ఉలికిపాట్లు.అలా అని టాలీవుడ్ లో అందరూ తనపట్ల హ్యాపీగా ఉన్నారని కాదు.పైకి నవ్వుతున్నా లోలోపల ఈర్ష్యతో రగిలిపోతున్న వాళ్ళు లేకపోలేదు.

 

సరే పోటీపరంగా ఏం చేయలేం కాబట్టి ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి.దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.ఒకటి షూటింగ్ జరుగుతున్న వాటిని రహస్యంగా ఫోటోలు వీడియోలు ఏదోలా బయటికి రప్పించి సోషల్ మీడియాలో వదలడం.రెండోది పిక్స్ ని మార్ఫింగ్ చేసి ఇదిగో డార్లింగ్ ఇలా ఉన్నాడేంటి ఇలా అయ్యాడేంటని మీమ్స్ గట్రా చేయించి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయడం. ఇవన్నీ సత్యదూరంలో ఉన్నాయని సగటు జనాలకు అర్థం కాదు. ఇదంతా ఎదగడం చూసి ఓర్వలేని వ్యవహారమే. ప్రభాసే కాదు రాజమౌళి సైతం ఆస్కార్ రేంజ్ కి తన స్థాయిని పెంచుకున్నాడు.

 

ఇప్పటికీ సో కాల్డ్ నార్త్ సెలబ్రిటీలు కనీసం విష్ చేసిన పాపాన పోలేదు. దక్షిణాది దర్శకుడి వైభవాన్ని చూసి తట్టుకోలేని తనమిది. ఆర్ఆర్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు దూసుకుపోతున్నారు.ఇంటర్నేషనల్ మీడియా గుర్తించింది. ప్రధాని స్థాయి కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఇవన్నీ మాకే సొంతమని విర్రవీగుతూ వచ్చిన ఉత్తరాది స్టార్ల పిఆర్ టీమ్ లు వేస్తున్న ఎత్తుగడలు ఒకటా రెండా. ఎంత చేసినా కొండమీద దూది ఉండలు విసిరినట్టు ఉంటుందే తప్ప ప్రభాస్ లాంటి వాళ్లకు ఊడేది పోయేది ఏమీ లేదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -