Prabhas: ప్రభాస్‌కు బట్టతల వచ్చిందా.. అందుకే క్యాప్ పెట్టుకుంటుండా?

Prabhas: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబలి సినిమాతో హీరో ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. స్టార్ క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. వరల్డ్ వైడ్ ప్రభాస్ తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు భారీ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. అయితే ప్రభాస్ హీరోగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తి కూడా. తన దగ్గరికి సాయం కోసం ఎవరూ వచ్చినా.. ప్రభాస్ కాదనకుండా సహాయం చేస్తుంటారు. అలాగే చిన్న హీరోలు, యంగ్ హీరోలు తమ సినిమా ప్రమోషన్ గురించి అడిగినా.. ప్రమోషనల్ ఈవెంట్‌కు అటెంట్ అవుతాడు. అలాగే పలు సినిమాల ట్రైలర్, టీజర్ రిలీజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రభాస్ బయటకు వచ్చిన ప్రతీసారి తలకు క్యాప్ లేదా స్క్రాప్ పెట్టుకుని వస్తుంటాడు.

ఇటీవల మహేశ్ బాబు తండ్రి కృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించినప్పుడు కూడా ప్రభాస్ తలకు క్యాప్ పెట్టుకుని వచ్చాడు. అలా చాలా సందర్భాల్లో ప్రభాస్ స్టైలిష్ క్యాప్‌లను వేసుకుని దర్శనమిస్తున్నాడు. అయితే ప్రభాస్ తన తలకు క్యాప్ ఎందుకు పెట్టుకుంటున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ హెయిర్ ఫాల్ అవుతుందని, నెత్తి మీద జుట్టు లేదనే క్యాప్ పెట్టుకుంటున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. అది కవర్ చేయడానికే నెత్తిపై టోపి పెట్టుకుంటున్నాడని నెటిజన్లు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రభాస్ సన్నిహితులు స్పందించారు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఆదిపురుష్ సినిమా కోసం ఓ హైయిర్ స్టైల్, సలార్ సినిమాలో మాస్ హెయిర్ స్టైల్, ప్రాజెక్ట్ కేలో మరో హెయిర్ స్టైల్ మెయిన్‌టైన్ చేస్తున్నాడట. ఈ హెయిర్‌స్టైల్‌కు సంబంధించిన లుక్స్ బయట లీక్ కాకుండా ఉండటానికే ప్రభాస్ జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. అందుకే ప్రభాస్ బయటకు వచ్చిన ప్రతీసారి క్యాప్ వేసుకుని దర్శనమిస్తున్నాడని పేర్కొన్నారు. పొరపాటున లుక్ బయట పడితే.. సినిమా ప్రయోషన్స్ పై దెబ్బ పడుతుందని ఆయా చిత్ర యూనిట్లు భావిస్తున్నాయి. సినిమాలపై హైప్ పోతుందని ప్రభాస్ తన తలపై క్యాప్ పెట్టుకుంటున్నాడని సమాచారం.

 

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -