Prabhas: ప్రభాస్ అంటే ఈ హీరోయిన్ కు ఇంత ఇష్టమా?

Prabhas: ప్రభాస్ కు జోడీగా మంచి మూవీలో నటించాలని ఉందని ఆ కోరిక తీరాలని ఆమె భావిస్తున్నారు. ప్రభాస్ అంటే ప్రాణమని పాయాల్ చెప్పుకొచ్చారు.!

 

పాయల్ రాజ్‌పుత్ తన సినీ కెరీర్ ను ‘Rx 100’ మూవీతో ప్రారంభించింది. ఆ మూవీలో హీరోయిన్ గా చేసినప్పటికీ అందులో ఆమె నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించింది. అయినప్పటికీ ఆయన ఆ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి ప్రశంసలు అందుకుంది.

కానీ ‘Rx 100’ క్రేజ్ ను పాయల్ రాజ్‌పుత్ కొనసాగించ లేక పోయింది. ఈ మూవీ తర్వాత ఆఫర్స్ వచ్చినప్పటికీ అవి తక్కువ బడ్జెట్ చిత్రాలు. ప్రస్తుతం ఆమె కు మీడియం-రేంజ్ హీరోల తో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ‘Rx 100’ లో పాయల్ తన అందం తో కుర్రకారును ఒక రేంజ్ లో అలరించింది.ఆ మూవీ తో గ్లామరస్ హీరోయిన్స్ లిస్ట్ లో పాయల్ రాజ్‌పుత్ చేరిపోయింది. తర్వాత వెంకీ మామ లో నటించిన ఆమె కెరీర్ అనుకున్నంత స్థాయిలో ఎదగలేదు.

రీసెంట్ గా జిన్నా మూవీ లో నటించిన ఆమె తన పాత్రకు ఎంతో న్యాయం చేశారు.ఈ నేపథ్యంలో వనితా టీవి కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన ఫేవరెట్ హీరో ప్రభాస్ అని చెప్పారు. అలాగే ఎప్పటికైనా అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందన్న తన అభిలాషను వ్యక్తం చేశారు.

కరెక్ట్ గా ఇంటర్వ్యూకి రావడానికి కొద్దిసేపు ముందు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ప్రభాస్ జిన్నా మూవీ గురించి చేసిన పోస్ట్ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తన జీవితం మీద ఎప్పుడూ ఆశావాదంతో ఉంటానని ఎప్పటికైనా ప్రభాస్ తో కలిసి సినిమా చేస్తాను అనేది తన దృఢ సంకల్పము అని ఆమె చెప్పారు.” నాకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టం .. ఆయనలో ఏదో స్పార్క్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. సహజంగా అనిపించే స్టైల్ అంటే నాకు మరింత ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని వుంది” అని ఆమె అన్నారు. త్వరలోనే ఆమె అశ నెరవేరాలని నెరవేరాలని కోరుకుందాం.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -