Prabhas: ఆ హీరోయిన్ కు ప్రభాస్ కు మధ్య అలాంటి బంధం ఉందా?

Prabhas: తెలుగు సినిమా పేరును విశ్వవ్యాప్తం చేసి, తెలుగు సినిమా మార్కెట్ ను భారీగా పెంచిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన ప్రభాస్ కి ప్యాన్ ఇండియాలో క్రేజ్ వచ్చింది. దక్షిణాది నుండి మరీ ముఖ్యంగా తెలుగు నాట నుండి ఇలాంటి భారీ హీరో ఉన్నాడా అని అందరూ మాట్లాడుకునేంతలా ప్రభాస్ పాపులారిటీ పెరిగింది.

 

ప్రస్తుతం ప్రభాస్ అన్ని ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తుండగా.. ఆయన పెళ్లి గురించి మరోసారి వార్తలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ చేసిన తాజాగా కామెంట్లు ప్రభాస్ పెళ్లి అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చాయి. హిందీలో ‘బేడియా’ సినిమాను తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ చేస్తుండగా.. ఈ సినిమా ప్రమోషన్ కోసం కృతి హైదరాబాద్ వచ్చింది.

 

అక్కడ పెట్టిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న కృతి.. టైగర్ ష్రఫ్ తో డేటింగ్ చేస్తానని, కార్తిక్ ఆర్యన్ తో ఫ్లర్టింగ్ చేస్తానని, ప్రభాస్ తో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. దీంతో ప్రభాస్ తో కృతి నిజంగా పెళ్లి చేసుకుంటుందా అనే చర్చ మొదలైంది. వీరిద్దరు కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తుండగా.. దీనిపై ఇప్పుడు చర్చ మొదలైంది.

 

అయితే ప్రభాస్ తో కృతి సనన్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతోందని.. వారిద్దరి బంధం బలపడిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా కృతి ప్రభాస్ కు ఉన్న ఆస్తిని చూస్తోందని, అతడికి ఉన్న కోట్లను చూసి ప్రభాస్ ను టార్గెట్ చేసినట్లు కంతమంది అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో కానీ.. ప్రభాస్ పెళ్లి అయ్యే వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -