Prabhas: కృష్ణంరాజు ఆస్తి విషయంలో ప్రభాస్ పెద్దమ్మ నిర్ణయం ఇదే!

Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్‌లో తనకంటూ స్పెషల్ ఈమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కేంద్రంలో వాజ్‌పేయీ హయాంలో కృష్ణంరాజు కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు. అలాంటి సూపర్ స్టార్.. గత నెల 11వ తేదీన తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవలే కృష్ణంరాజు సంస్మరణ సభ జరిగింది. సొంతూరు మొగల్తూరులో కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణంరాజు మరణంతో ఆయన సతీమణి శ్యామలాదేవి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన ఆస్తిపై పూర్తి అధికారాలు ప్రభాక్‌కు వచ్చేలా వీలునామా రాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే చెల్లెళ్ల పెళ్లిళ్ల బాధ్యతలు కూడా ప్రభాసే చూసుకునేలా వీలునామాలో రాణించినట్లు సమాచారం. కృష్ణం రాజు మృతి తర్వాత ఇంటి బాధ్యతలు మొత్తం ప్రభాసే చూసుకునేలా.. ఇంటికి పెద్ద దిక్కు ప్రభాసే అంటూ శ్యామలాదేవి చెప్పినట్లు తెలుస్తోంది.

 

తన ఆరోగ్యం కుంటుపడినా.. తన ఆస్తి మొత్తం ప్రభాస్‌కు చెందేలా శ్యామలాదేవి వీలునామా రాయించారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శ్యామలాదేవి నిర్ణయంతో ఒక్కసారిగా ఆమె కూతుర్లు షాకింగ్‌కు గురవుతున్నారు. అయితే శ్యామలాదేవి తీసుకున్న నిర్ణయంపై ప్రభాస్ అభిమానులు మాత్రం సంతోష పడుతున్నారు. ఇంటి బాధ్యతలు తమ హీరో చేపట్టడమే కరెక్ట్ అని అంటున్నారు. కాగా, కృష్ణంరాజు మృతితో ప్రభాస్‌కు మరింత బాధ్యతలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్‌కు నలుగురు చెల్లెల్లు ఉన్నారు. నలుగురు చెల్లెల్ల పెళ్లిళ్లు, పెద్దనాన్న కుటుంబాన్ని ప్రభాసే చూసుకోవాలి. కాగా, ప్రభాస్‌కు పెద్దనాన్న కృష్ణంరాజు అంటే ఎంతో ప్రేమ. వీరిద్దరికీ ప్రత్యేకమైన బాండింగ్ ఉండేది. ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాలో కృష్ణంరాజు నటించారు. అంతకు ముందు బిల్లా సినిమాలో ఆయన నటించారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ హిట్ అందుకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -