Prabhas: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత సాహో, రాదేశ్యామ్ వంటి సినిమాలతో పలకరించిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చాలా రోజుల కిందటనే షూటింగ్ ను పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా విడుదల తేదీని ఇంతవరకు ప్రకటించలేదు చిత్ర బృందం.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ అలాగే కృష్ణంరాజుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసిన ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడంతో పాటు ఆ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోలో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ అలాగే కృష్ణంరాజు నటించిన పాత్రల లోని సన్నివేశాలను పక్కపక్కనే ఎడిట్ చేసి అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రెండు నిమిషాల పైనే ఉన్న ఆ వీడియో ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోని చూసిన అభిమానులు ఏం ఎడిటింగ్ రా మామ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు కృష్ణంరాజు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
View this post on Instagram