Prabhas Salaar: ప్రభాస్ సలార్ రేంజ్ ఇదీ.. సలార్ శాటిలైట్ రైట్స్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Prabhas Salaar: రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ అంటే తెలియని వారుండరు. బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా హీరో గా మొదటి స్థానంలో నిలిచాడు. మొదటిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అంతగా సక్సెస్ సాధించకపోయినా.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా లో నటించాడు. ఈ సినిమా నుంచి ప్రభాస్ కు చాలా ప్రశంసలు, ప్రేమ, ఆధారణ ప్రేక్షకుల నుంచి దక్కాయి. దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. అయితే మరోసారి రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి.
తను ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. వరుసగా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వగా ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే మొదలైన ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది. పూర్తి చేసుకుని టీజర్ కూడా రిలీజ్ చేశారు.
ఇక కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ రెండు షెడ్యూల్ లను యాక్షన్ సీన్లతో మాత్రమే పూర్తి చేశాడట. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్లకు భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
తెలుగు వర్షన్ సాటిలైట్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ హక్కులను స్టార్ మా సంస్థ సొంతం చేసుకుంది. దాని కోసం స్టార్ మా కొన్ని కోట్ల రూపాయలు మేకర్స్ కు చెల్లించినట్లు సమాచారం. దీంతో స్టార్ మా కోట్ల ధరతో కొనుగోలు చేసిన సినిమాలలో సలార్ ఒకటిగా చేరింది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts