Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబెల్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ సినిమాతో ఈయన నటించే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇకపోతే ఇండస్ట్రీలో ప్రభాస్ ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం కృష్ణంరాజు గారిని చెప్పాలి. కృష్ణంరాజుకి ముగ్గురు కుమార్తెలే ఉండడంతో ప్రభాస్ ను తన వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఇలా ప్రభాస్ సినీ కెరీర్ ని ప్రోత్సహిస్తూ సినిమా విషయాలలో తనకు సలహాలు సూచనలు చేస్తూ తన ఎదుగుదలకు కృష్ణంరాజు గారు ఎంతో కృషి చేశారు.ఇకపోతే కృష్ణం రాజుగారు సెప్టెంబర్ 11వ తేదీన గుండెపోటు సమస్యతో మరణించడంతో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు మొత్తం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తన షూటింగులకు కూడా బ్రేక్ చెప్పి తన కుటుంబ సభ్యులతో గడుపుతూ వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు.
ఇకపోతే కృష్ణంరాజు గారి కుమార్తెలు అంటే ప్రభాస్ కి అమితమైన ప్రేమ.ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద ఒక సందర్భంలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోని ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రసీద సినిమాలపై మక్కువతో ఫిలిం ప్రొడ్యూసర్ గా మారాలని భావించారట. ఈ క్రమంలోనే ఈ ఫీల్డ్ లో రావడానికి ప్రభాస్ తనని ఎంతగానో ప్రోత్సహించారని ప్రసీదా వెల్లడించారు.
ముఖ్యంగా ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఈమె అమెరికాలోని న్యూ యార్క్ ఫిల్మ్ అకాడెమిలో తను ప్రొడక్షన్ పై కోర్సు చేసేందుకు అన్ని రకాల హామీలను ప్రభాస్ ఇచ్చినట్టు ప్రసీద తెలిసింది.అలాగే తాను నిర్మించిన సినిమాల పట్ల ప్రభాస్ ఎప్పుడు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ తనకు ఎంతో సపోర్ట్ చేశారని ఈమె వెల్లడించారు. ఇక తమ అన్నయ్యకు చెల్లెలు అంటే ఎంతో ఇష్టమని ఒక్కోసారి గంటలు కాకుండా రోజు మొత్తం మాతో కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంతో సరదాగా అన్నయ్య గడుపుతారు అంటూ గతంలో ప్రసీద చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా చెల్లెల కెరియర్ పట్ల అడుగడుగునా ప్రభాస్ ప్రోత్సహిస్తూ వారి పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థం అవుతుంది.