Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చే శుభవార్త.. ఏంటంటే?

Prabhas: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాని అశ్వినీ దత్ కే.వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ‘మహానటి’ వంటి అద్భుత చిత్రాన్ని ఇండస్ట్రీకి అందించిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రాజెక్ట్ కే టైటిల్‌తో సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనే మూడో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటారని సమాచారం. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేందుకు ప్రభాస్ ప్రయత్నాలు చేస్తారని, అమితాబ్ బచ్చన్ పాత్రతో కథ మలుపు తిరుగుతుందని పేర్కొన్నారు. అయితే అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుందని సమాచారం.

 

కాగా, సినిమా షూటింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రభాస్-దీపికపై షోటో షూట్‌కు ప్లాన్ చేశారు. ఈ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ప్రాజెక్ట్ కే విజువల్ వండర్‌గా ఉండబోతుందని, అభిమానులను ఆశ్చర్యపరిచేలా సన్నివేశాలు ఉంటాయన్నారు. ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్ స్వీక్వెన్స్ లు ఉంటాయట. ఇందుకోసం హాలీవుడ్‌కు చెందిన ఐదుగురు ఫైట్ మాస్టర్లను నాగ్ అశ్విన్ రంగంలోకి దింపారట. అయితే ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ లను ఒక్కో ఫైట్ మాస్టర్‌ను కేటాయించనున్నారు. అలాగే అవెంజర్స్, కింగ్‌కాంగ్, గాడ్జిల్లా వంటి భారీ చిత్రాలకు ఉపయోగించిన కెమెరాలను ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలో ఉపయోగిస్తున్నారట. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా, పుట్టిన రోజు సందర్భంగా సినిమా పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పాన్ ఇండియా స్థాయిలో 2024 ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts