Prabhas: ఈసారి గట్టిగా కొడుతున్నాం.. రికార్డులు బద్దలవుతాయి!

Prabhas: తెలుగు సినీ చరిత్రలో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన సినిమా బాహుబలి. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదలైంది. రెండూ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి. భారీ వసూళ్లను రాబట్టాయి. ఆ సినిమాలో నటించిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు. ఇక బాహుబలి సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్ నుంచి ఆయనకు పిలుపొచ్చింది. ఆ తర్వాత వెంటవెంటనే ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నారు.

 

ప్రభాస్ తన తదుపరి సినిమాలు చాలానే అనౌన్స్ చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కొంత అసహనంతో ఉన్నారు. బహుబలి తర్వాత సాహో సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన భారీ సినిమా రాధేశ్యామ్ కూడా హిట్ గా నిలువలేదు. దీంతో సక్సెస్ లేని ప్రభాస్ భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆయన తన ఫ్యాన్స్ తో కూడా ఓ సందర్భంలో మాట్లాడారు. తన ఫ్యాన్స్ లో జోష్ ను నింపారు.

 

సాహో, రాధేశ్యామ్ సినిమాలతో రెండు ఫ్లాపులు చవిచూసిన తర్వాత ప్రభాస్ తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. తాను సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో భారీ విజయాన్ని అందిస్తానని తెలిపాడు. హిట్టు గట్టిగా కొడుతున్నామని తన ఫ్యాన్స్ కు చెప్పడంతో వారు ఆనందంలో ముగినిపోయారు. ప్రభాస్ త్వరలోనే ప్రాజెక్ట్ కే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న సలార్ సినిమా కూడా రానుంది. ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందించనున్నాయి. ప్రభాస్ తన ఫ్యాన్స్ తో ఈ విషయం చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు వస్తాయని, తమ అభిమాన హీరో భారీ సక్సెస్ ను అందుకోనున్నాడని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -