Prabhas: బాలయ్య ప్రశ్న విని ప్రభాస్ షాకయ్యారట.. చివరకు?

Prabhas: మగువల మనసు దోచే యాక్షన్ హీరో, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ప్రభాస్. అయితే సాధారణంగా ప్రభాస్ కు టీవీ షోలు, ప్రోగ్రాములు పెద్దగా నచ్చవు. అందుకే ఇప్పటి వరకు అలాంటి షోలకు ప్రభాస్ హాజరు కాలేదు. ఫ్యాన్స్ కూడా చాలా రోజులుగా ప్రభాస్ ను అలాంటి వేదికపై చూడడానికి ఉవ్విళ్లూరుతూ ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఫ్యాన్స్ కు కిక్ ఇచేలా ప్రభాస్ ఓ షోలో రానున్నాడు. అదే బాలయ్య బాబు చేస్తున్న “అన్‌ స్టాపబుల్‌”.

 

సాధారణంగానే ప్రభాస్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అలాటిది బాలయ్య బాబుతో కలిసి వేదిక పంచుకోవడం అంటే ఇక ఆ షో.. అభిమానులకు పండగే. ఇక ఈ షో ను బాలయ్య బాబు మాములుగా నడిపించడం లేదు. ఎంతో మందిని షోకు ఆహ్వానించి సూపర్ హిట్ షోగా నిలిపాడు. దీనితో ఆహా షో ఎక్కడలేని పాపులారిటీని సంపాదించింది. ఇక ఇప్పుడు ఈ షో రెండో సీజన్‌ లో 6 వ ఎపిసోడ్‌ కు బాహుబలి ప్రభాస్‌ అతని మిత్రుడు గోపీచంద్‌ తో కలిసి పాల్గొన్నాడు.

 

అనుష్క తో కథ ఎక్కడి వరకు వచ్చింది.
ఈ షోలో భాగంగా నడిచిన ఫన్నీ టాక్ లో బాలయ్య బాబు వేసిన ఓ ప్రశ్నకు ప్రభాస్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ ను బాలయ్య “అనుష్క శెట్టి తో నీ ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది?” అని అడిగాడంట. దీనికి ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ తో అందరికీ మతి పోయినట్టు టాక్. అదేంటి మీకు తెలియదా.. మీడియా మా ఇద్దరికీ చాలా సార్లు పెళ్లి చేసేసింది. అని ప్రభాస్ చెప్పడంతో సెట్ మొత్తం నవ్వులు విరబూసాయంట. అప్పట్లో ఎన్నో సార్లు మీడియాలో వీళిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి.

 

ఇక తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో ఈ పార్ట్ కట్ చేసి విడుదల చేసారు. దీనిలో బాలయ్య బాబు ప్రభాస్ ను “ఇక చివరగా ఈ ప్రోమోలో ఆ హీరోయిన్‌ తో నీ ఎఫైర్‌ ఎక్కడి వరకు వచ్చింది” అని ప్రశ్నిస్తాడు. మరి దానికి ప్రభాస్‌ ఏ రకమైన ఆన్సర్‌ చెప్పాడో పూర్తిగా తెలియాలంటే ఈ ఎపిసోడ్ విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ప్రేక్షకులందరూ నిరీక్షిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -