Prabhas: డూప్ లపై డిపెండ్ అయిన ప్రభాస్.. ఇంత కర్మేంటంటూ?

Prabhas: మామూలుగా సినిమాలలో హీరోలకు డూప్ లు చేస్తూ ఉంటారు. చాలావరకు ఎత్తైన వాటిని ఎక్కడానికి, పైనుంచి కింద పడటానికి హీరోలు అంత సాహసం చేయరు. దీంతో దర్శక నిర్మాతలు డూప్ లతో అటువంటి సాహసాలు చేయిస్తూ ఉంటారు. అయితే అప్పటి సినిమాలల్లో చాలావరకు డూప్ లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారింది. ఇప్పుడున్న హీరోలే సొంతంగా సాహసాలు చేయటానికి ముందుకు వస్తున్నారు.

ఎత్తయిన వాటిని ఎక్కడం,కిందికి దూకడం వంటివి కూడా చేస్తున్నారు. అయితే ఒక హీరో మాత్రం ఇప్పటికీ డూప్ లనే వాడుతున్నాడు. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అదేంటి ప్రభాస్ డూప్ గా చేయించడం ఏంటి.. అంత హైట్, అంత పర్సనాలిటీ ఉన్న ఆయన.. సినిమాలల్లో సాహసం చేయడానికి నిరాకరించడం ఏంటి అని అనుకుంటున్నారా.

 

అవును ప్రభాస్ సాహసంతో కూడిన సన్నివేశాలు చేయడని తెలుస్తుంది. ఏదైనా కష్టమైనా సన్నివేశం ఉంటే చాలు వెంటనే డూప్ లను రంగంలోకి దింపుతాడట. ముందే ఆయన రూ.100 కోట్ల పారితోషకం తీసుకునే స్టార్ హీరో. ఆయన కంటే చిన్న హీరోలు సైతం తమ సినిమాలలో డూప్ లేకుండా చేస్తున్నారు. మరి ప్రభాస్ ఏంటి అంత పెద్ద హీరో అయినా కూడా డూప్ లపై ఆధారపడుతున్నారు అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి కూడా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్నాయి. అయితే ఆ సినిమాల కోసం ప్రభాస్ ఇద్దరు డూప్ లపై ఆధారపడ్డాడని తెలిసింది. అచ్చం తనలాగే ఉండే ఇద్దరు వ్యక్తులను ఎంచుకున్నాడట. ఏదైనా శరీరం అలసిపోయే సన్నివేశాలు వాళ్లతో చేయిస్తాడట. ఇక తను మాత్రం క్లోజప్ సీన్లు, ఎమోషన్ సీన్లు, లవ్, రొమాంటిక్ సీన్లలో మాత్రమే చేస్తాడని తెలిసింది. ఇక ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో చేస్తున్నాడు కాబట్టి ఏ సినిమాలోనైనా డూప్ లను పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలియటంతో కొందరు.. ఇంత పెద్ద హీరో అయి ఈ కర్మ ఏంటి బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -