Prabhas: ఆ పాత్రలో నటించనున్న రెబల్ స్టార్

Prabhas: ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కామెడీ, హర్రర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా దర్శకుడు మారుతి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభాస్ నటించబోయే సినిమాలో స్టోరీ కూడా భిన్నంగా ఉండేందుకు మారుతి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా హర్రర్ స్టోరీ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యం క్యారెక్టర్‌లో నటించనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ జ్యోతిక దెయ్యం క్యారెక్టర్‌లో యాక్టింగ్ చేసింది. సేమ్ ఇదే సినిమా కాన్సెప్ట్‌ తోనే ప్రభాస్ కొత్త చిత్రం రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు అప్పుడప్పుడు దెయ్యం ఆవహిస్తుందని, అప్పుడు ప్రభాస్ ప్రవర్తన వింతగా ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హర్రర్ కమ్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమా తెరకెక్కించేటట్లు కనిపిస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ఇలాంటి కథాంశం ఉన్న సినిమాలో నటించడం ఇది మొదటిసారి. హర్రర్ కామెడీలో దర్శకుడు మారుతి కామెడీ టైమింగ్స్ అదిరిపోతుంది. ఇప్పటికే ఆయన డైరెక్ట్ చేసిన చాలా వరకు సినిమా మంచి హిట్ టాక్ అందుకున్నాయి. అయితే ఈ సినిమా స్టోరీ నిధుల వేటకు సంబంధించి ఉంటుందని, ఇందులోనే హర్రర్, థ్రిల్లర్‌కు సన్నివేశాలను జోడించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు ఆయన తాత క్యారెక్టర్ కూడా కీలకంగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం నటుడు బొమన్ ఇరానీ పేరు వినిపిస్తోంది. అలాగే విలన్‌ పాత్ర కోసం బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -