Prabhas: ప్రభాస్ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కిందని తాజాగా సమాచారం అందుతోంది. డైరెక్టర్ మారుతి తీస్తున్న సినిమా నిశ్శబ్దంగా, వేగంగా సాగిపోతుందని తెలుస్తోంది. కాకపోతే రాజడీలక్స్ అని టెంపరరీగా టైటిల్ పెట్టుకున్నట్లు సమాచారం. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న హారర్ కామెడీ మూవీకి సైతం భారీ గ్రాఫిక్స్ పెడుతున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బడ్జెట్ కూడా భారీగానే ఉంటోందని టాక్.
ఈ నేపథ్యంలో ఆదిపురుష్ గ్రాఫిక్స్‌ను ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఆదిపురుష్‌కు వచ్చిన విమర్శలు ప్రభాస్ నటించి ఏ చిత్రానికీ రాలేదు. ఈ నేపథ్యంలో హారర్ కామెడీ చిత్రానికి భారీ బడ్జెట్, గ్రాఫిక్ష్ అనే సరికి అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. అయితే, దర్శకుడు మారుతితో సినిమా చేయాలని ప్రభాస్ ఎప్పుడో అనుకున్నారు. ఇది కొత్త ప్రాజెక్టేమీ కాదు.
రాధే శ్యామ్ మూవీ డిజాస్టర్ తరువాత కృష్ణంరాజు మరణించడం, ప్రభాస్ కాస్త అనారోగ్యానికి గురవడం వల్ల ప్రాజెక్టు కాస్త లేటయ్యింది. మరోవైపు సలార్ మూవీ కూడా ఆలస్యం అవుతోంది. ఇదికాక ఆదిపురుష్ సినిమా కారణంగా మరింత ఆలస్యం చోటు చేసుకుంటోంది. ఎలాగోలా షూటింగ్ పార్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయి హంగులు దిద్దాల్సి ఉంటే వెంటనే చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ప్రభాస్ మొత్తం పాన్ ఇండియా మూవీలే చేస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రభాస్ తాతగా, కొడుకుగా డబుల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అటు ప్రభాస్‌గానీ, ఇటు మారుతీగానీ స్పందించలేదు. ఈ సినిమా ఖర్చు కూడా కలిపితే ప్రస్తుతం ప్రభాస్ మీద ఆధారపడి దాదాపు 3 వేల కోట్ల సినిమాలు నిర్మాణంలో ఉన్నట్లవుతుంది. ఇది భారీ జూదమే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఆ నిర్మాతల పరిస్థితి బయటపడుతుందో లేదా మునుగుతుందోననే సందేహాలు కలుగుతున్నాయి.