Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగలనుందా?

Prabhas: గ్లోబర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. ఇదే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న భారీ యాక్షన్ ఫిల్మ్. కేజీఎఫ్ ఫేస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్‌ కు మాత్రం నిరాశే మిగిలేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా సార్లు సలార్ సినిమా రిలీజ్ డేట్ మారుతూ వస్తున్నాయి. దీనిపై రూమర్స్ కూడా భారీగా స్ప్రెడ్ అవుతున్నాయి.

 

 

సలార్ సినిమా వాయిదా పడినా.. వచ్చే ఏడాది సోలోగానే ప్రభాస్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. హారర్ కామెడీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అలాగే నటి రిద్ది కుమార్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. రిద్ది కుమార్ ఇప్పటికే ప్రభాస్‌తో నటించారు. ‘రాధేశ్యామ్’ సినిమాలో రిద్ది ట్రైన్ జర్నీలో కనిపిస్తారు. అప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అయి.. చేయి కోల్పోయిన వ్యక్తిగా కనిపించారు.

 

ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాత, మనవడు ఇలా ఇద్దరి పాత్రల్లో ప్రభాస్ నటించనున్నారు. అయితే ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే పేరు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మునుపెప్పుడూ చూడని కథతో మారుతి ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రభాస్ ‘ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే’ సినిమాలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -