Prabhas: ప్రభాస్ ఆస్తులు వారికి మాత్రమే సొంతమవుతాయా?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల పరంగా అందరికీ తెలుసు. కానీ ప్రభాస్ వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు. కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడే ప్రభాస్. తండ్రి చనిపోవడంతో పెద్దనాన్న కృష్ణంరాజు వద్దే ప్రభాస్ పెరిగాడు. కృష్ణంరాజు నటవారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్‌కు ప్రభోధ్ అనే సోదరుడితో పాటు ప్రగతి అనే సోదరి ఉంది.

ముగ్గురు సంతానంలో ప్రభాస్ చిన్నవాడు. మొదటి సంతానంగా ప్రభోధ్, ఆ తర్వాత ప్రగతి, తర్వాత ప్రభాస్ జన్మించారు. ఇక కృష్ణంరాజుకి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే ప్రభాస్ తన ఆస్తులను తన సోదరులకు రాసిచ్చాడని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. దీంతో ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా సినిమాలో చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ కు రెమ్యూనరేషన్ రూ. కోట్లలో ఉంటుంది.

వారికి ఆస్తులు రాసిచ్చిన ప్రభాస్

దీంతో ప్రభాస్ తనకున్న ఆస్తులను సోదరులకు పంచాడని, అవి వారికే ఇంక సోంతమని టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తోన్నాయి. సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్, ఇళ్లు మాత్రమే తనకు చాలని ప్రభాస్ చెప్పాడట. మిగతా ఆస్తులన్నీ సోదరులకు ఇచ్చాడని టాలీవుడ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తోన్నాయి. దీంతో ప్రభాస్ ది ఎంత గొప్ప మనస్సు కదా అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించి టీజర్ ప్రేక్షకులను ఆకట్టకుంది. ఇందులోని గ్రాఫిక్స్ సూపర్బ్ అనిపించాయి. ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాతో ప్రభాష్ నటిస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. అలాగే మారుతీ డైరెక్షన్ లో మరో సినిమాలో కూడా నటించేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -