Prabhas: ప్రభాస్ బర్తడే స్పెషల్.. రీ రిలీజ్ సినిమాలలో కనిపించని సందడి?

Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ అక్టోబర్ 23వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున ఈయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడానికి అభిమానులు అన్ని ఏర్పాట్లను చేశారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేకంగా వారు నటించిన సినిమాలను తిరిగి విడుదల చేయడం ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా, వర్షం రెబల్ వంటి సినిమాలను ప్రత్యేకంగా తిరిగి విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాలకు పెద్దగా ఊహించిన స్థాయిలో ఆదరణ రాలేదని తెలుస్తుంది.

పాన్ ఇండియా హీరో సినిమాలు తిరిగి విడుదల అవుతున్నాయి అంటే పెద్ద ఎత్తున ఈ సినిమాలపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అయితే ఈ సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. ఇలా ప్రభాస్ రీ రిలీజ్ సినిమాలకు ఆదరణ లేకపోవడానికి కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అని తెలుస్తుంది.

సరైన ప్లానింగ్ ప్రకారం ఈ సినిమాలను విడుదల చేసి ఉంటే మంచి కలెక్షన్లను రాబట్టేవి. అయితే ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు అభిమానులను సైతం నిరాశ పరుస్తున్నాయి. అదేవిధంగా రెబల్ బిల్లా వంటి సినిమాలు అప్పట్లోనే ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలను తిరిగి చూడటానికి అభిమానులు కూడా ఉత్సాహం చూపడం లేదని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమా కలెక్షన్లను ప్రభాస్ బ్రేక్ చేస్తాడు అనుకుంటే, ప్రభాస్ సినిమాల బుకింగ్స్ మాత్రం అభిమానులను నిరాశ పరుస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -