Narendra Modi: ప్రధాన్ నరేంద్ర మోదీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Narendra Modi: ఇండియన్ మూవీస్ కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ సినీమాలు వివాదాస్పద సినిమాలుగా ముద్ర వేయబడిన విషయం తెలిసిందే. ఈ సినిమాల వల్ల దేశంలో మతవిద్వేషాలు చెలరేగుతాయని నమ్మిన వారు, నమ్ముతున్నవారు ఉన్నారు. మరో వైపు కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి చుట్టూ భద్రతా సిబ్బందిని పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు కేరళ స్టోరీ నిర్మాత విపుల్ షా, దర్శకుడు సుదీప్తో సేన్, నటి అదా శర్మ టీవీల్లో రకరకాల డిబేట్లలో పాల్గొన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక వెస్ట్ బెంగాల్ ప్రభుత్వమైతే కేరళ స్టోరీని బ్యాన్ చేసేసింది. అల్లర్లు చెలరేగుతాయని భయమట. తమిళనాడులో మల్టీప్లెక్స్ వాళ్లు స్వచ్ఛందంగా ఈ సినిమాకి దూరంగా ఉన్నారు. థియేటర్స్ మీద దాడులు జరగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ ప్రభుత్వమున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ చిత్రానికి పన్ను మినహాయింపుని ప్రకటించాయి. పన్నులు ఉండవు కాబట్టి తక్కువ ధరలకే టికెట్ అమ్మి ఎక్కువ మందికి చూపించమంటున్నాయి ఆ రాష్ట్ర ప్రభుతాలు.

 

కాగా మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ ఆ చిత్రాన్ని చూసి తీరాలని దేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఏ ముస్లిం గ్రూపులూ ఏ సినిమా హాలు మీదా దాడి చేయలేదు. ఒక చోట కాకపోతే మరొక చోటైనా ఏదో ఒక అలజడి జరిగుండాలి కదా! అదీ జరగలేదు. సినిమా చూసొచ్చిన జనం ఎమోషనల్ అయ్యి మీడియా బైట్స్ ఇస్తున్నారు. అధికశాతం ముస్లిం సోదరులు మాత్రం పట్టించుకోనట్టే ఉన్నారు. కాబట్టి అసదుద్దీన్ ఒవైసీ వంటి వాళ్లు అడిగినప్పుడు కేరళ స్టోరీలో ఉన్నదంతా అబద్ధమే. అది నిజమని నిరూపిస్తే కోటి రూపాయలిస్తా అన్నాడు. దానికి బదులుగా, ఇందులో ఉన్నది నిజం కాదని నిరూపిస్తే పదికోట్లిస్తానని ఒక హిందూ మిత్రుడు ప్రకటించాడు. నిజంగా అంత నిరూపించే శక్తే ఉంటే ఒవైసీ అతని దగ్గరకెళ్లి పదికోట్లు సంపాదించుకోవచ్చు అని ఎద్దేవా చేసాడు కేరళ స్టోరీ నిర్మాత విపుల్ షా.
కొందరు ముస్లిం ప్రవచనకారులు యూట్యూబులో కేరళ స్టోరీలో చూపబోయేదంతా అబద్ధమని చెబుతూ కొన్ని చిన్న చిన్న వీడియోలు ఉన్నాయి. అయితే అవన్నీ అధికశాతం సినిమా విడుదలకి ముందు వచ్చినవే. ఇలా మాటలు, అభిప్రాయాల వెల్లడి తప్ప ఎటువంటి అరాచకం జరగకపోవడం దేశం అదృష్టం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: భర్త పదవి భార్యకు ఇస్తున్న ఏపీ సీఎం జగన్.. ఈ ప్రయత్నాలు ఫలించే ఛాన్స్ ఉందా?

CM Jagan: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి సీఎం జగన్ లో కనిపిస్తుంది. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెంనాయుడు పోటీలో ఉన్న...
- Advertisement -
- Advertisement -