Pragathi: అలాంటి వ్యక్తి కావాలంటున్న ప్రగతి.. ఏం జరిగిందంటే?

Pragathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులకు మంచి గుర్తింపు, పేర్లు వచ్చాయి. అలాంటి జాబితాలో పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఇలాంటి జాబితాలో తెలుగులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన ప్రగతికి మంచి గుర్తింపు ఉంది. చాలా సినిమాల్లో హీరో/హీరోయిన్ కి తల్లి, వదిన, అక్క లాగా ప్రగతి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

 

కేవలం సినిమాల ద్వారానే కాకుండా సొంతం యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో ఫుడ్, బ్యూటీ, వర్కవుట్ వీడియోలు పెడుతూ సోషల్ మీడియాలో ప్రగతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. అయితే విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న ప్రగతి.. తన హాట్ వీడియోలతో కుర్రకారు హృదయాలను మాత్రం వేడెక్కిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి ప్రస్తావన రాగా.. దానిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

 

రెండో పెళ్లి చేసుకుంటారా? అని యాంకర్ ప్రగతిని ప్రశ్నించగా… ఆమె సమాధానమిస్తూ.. ‘పెళ్లి అనేది అవసరం. కానీ ఆ పదం కన్నా కంపానియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చాలాసార్లు నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మళ్లీ నా మెచ్యూరిటీ లెవల్ కి మ్యాచ్ అయ్యే వాళ్లు దొరకాలి కదా’ అని రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం చెప్పలేదు.

 

అలాగే ప్రగతి మాట్లాడుతూ.. ‘అదీగాక సింగిల్ పర్సన్ దొరకడం కష్టం కానీ రావాలని ఉంటే అదే జరుగుతుంది. అయినా నాతో కొంచెం కష్టం. ఎందుకంటే కోన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. ఇలాగే కావాలి అలాగే ఉండా అని అనుకుంటాను. ఇప్పుడు 20ల వయసు ఉంటే అడ్జస్ట్ అయ్యే దాన్ని కావచ్చు. ఇప్పుడు కష్టం’ అని వివరణ ఇచ్చింది. మరి తెలుగు ఇండస్ట్రీలో చాలామంది లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రగతి కూడా పెళ్లి పీటలెక్కుతుందేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -