Prathipadu MLA: వచ్చే ఎన్నికల్లో ఓటెయ్యకపోతే, అన్నీ ఆపేస్తా: ఎమ్మెల్యే వార్నింగ్

Prathipadu MLA: అతను ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మాటలు బాగా వైరల్ అవుతోంది. ఈ మాటల ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. అదేమిటంటే వచ్చే ఎన్నికల సమయంలో ఓటు వెయ్యక పోతే అన్ని సంక్షేమ పథకాలను, ఉచిత పథకాలను నిలిపేస్తాం అంటూ బహిరంగంగా హెచ్చరించిన ఓ వీడియో వైరల్ అవ్వడం.

మన ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన , ప్రజలే ఎన్నుకోబడుతున్నారన్న విషయం మనకు తెలుసు….దీని కోసం రాజ్యాంగం ప్రజలకు వారి యొక్క పౌరసత్వంను నిరూపించుకోవటానికి 18 సంవత్సరాలు నిండిన వారందరికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది. కాని కాలక్రమంలో వచ్చిన ఈ మార్పుల కారణంగా ఓటు విలువ కూడా మారిపోతోంది.

ఇప్పుడున్న ప్రజలు తమకు నచ్చిన మెచ్చిన నాయకుడుకి బదులు.. తమకు సంక్షేమ పథకాలను, ఉచిత పథకాలను అందించేవారిని ఎక్కువగా ఎన్నుకునే ధోరణి మొదలయిందని కొంతమంది రాజకీయ నాయకులు వాపోతున్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజవర్గం శంఖవరం మండలం అన్నవరంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే పెన్షన్లు ఆగిపోతాయని మహిళలపై ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -