Premarital Checkup: మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే పెళ్లికి ముందే ఈ పరీక్షలు చేయించుకోండి?

Premarital Checkup: మామూలుగా పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి జాతకాలు, చదువులు, ఆస్తుల గురించి తెలుసుకుంటారు. కానీ వీటి కంటే ముఖ్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో రకరకాల జబ్బులు రావటంతో పుట్టబోయే పిల్లలకు కూడా జన్యుపరమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి పెళ్లికి ముందే పరీక్షలు చేయించుకొని వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు అంటున్నారు. ఇంతకు పెళ్లికి ముందు చేసుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే..

సంతాన ఉత్పత్తి పరీక్ష: సంతాన ఉత్పత్తి పరీక్షలు చేసుకోవడం వల్ల ముందుగానే సంతానానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చు. అదే పెళ్లయిన తర్వాత చేయించుకుంటే పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతుంది.

జన్యు వైద్య చరిత్ర: ఇక ఈ మధ్యకాలంలో వచ్చే జబ్బులను దృష్టిలో పెట్టుకున్నట్లయితే అమ్మాయి తరపున అబ్బాయి తరపున కుటుంబ వైద్య చరిత్ర తెలుసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తు కోసం ముందే జాగ్రత్త పడవచ్చు.

తలసేమియా పరీక్ష: పిల్లలకు పుట్టుకతోనే కొన్ని వ్యాధులు వస్తున్నాయి. అందులో తలసేమియా వ్యాధి ఒకటి. కాబట్టి పెళ్లికి ముందే ఈవ్యాధి పరీక్షలు చేయించుకోవాలి.

హెచ్ఐవి పరీక్ష: హెచ్ఐవి పరీక్ష గురించి అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందే ఇటువంటి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సురక్షితమైన సెక్స్ కి ఇది చాలా ముఖ్యం.

మానసిక ఆరోగ్య స్థితి: ఈమధ్య చాలామంది మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి గురించి ముందుగానే అమ్మాయి, అబ్బాయి తెలుసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు ఈ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమైనవని అనుభవంతో చెబుతున్నారు వైద్య నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -