Viral: వైరల్ అవుతున్న ప్రియా చౌదరి సంచలన వ్యాఖ్యలు!

Viral: ఇటీవల హైదరాబాద్ శివారులో పెద్ద అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సీ సీ కెమెరాలో రికార్డు అవ్వగా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో చూసినట్లయితే సైలెంట్ గా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాబు పై ఆ కుక్కలు వచ్చి దాడి చేశాయి. నిజానికి ఆ బాబు ఆ కుక్కల్ని ఏమీ అనలేదు. కానీ ఆ కుక్కలు మాత్రం ఆ బాలుడిని ఘోరంగా కొరికి చంపివేసాయి.

అయితే ఈ ఘటన అందరి హృదయాలను కదిలించింది. ప్రతి ఒక్కరు ఈ ఘటనపై భావోద్వేగం చెందారు. అంతేకాకుండా జిహెచ్ఎంసి అధికారులపై ఫైర్ అయ్యారు. వీధి కుక్కల నుండి రక్షణ లేకుండా పోతుందని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన సరిగా పట్టించుకోవటం లేదు అంటూ వారిపై ఫైర్ అయ్యారు. ఇక ఈ ఘటన పట్ల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఫైట్ చేశాడు.

 

ఇప్పటికీ ఆయన సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు షేర్ చేస్తూనే ఉన్నాడు. ఇక రోజు రోజుకి ఇటువంటి ఘటనలను ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే దీంట్లో తప్పు అంటున్నారు కొందరు వ్యక్తులు. అందులో ఒకరు ప్రియా చౌదరి. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని కుక్కల్ని మనం గెలకకపోతే అవి మనల్ని ఏమీ చేయలేవు అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

 

చాలావరకు అందరూ కుక్కల్ని గెలుకుతారు అంటూ.. వాటి పిల్లలను కూడా గెలుకుతూ ఉంటారు అని అందుకే అవి తిరిగి దాడి చేస్తాయి అని కొన్ని వ్యాఖ్యలు చేసింది. చాలావరకు మనుషులదే తప్పు అన్నట్లుగా ఆమె మాట్లాడింది. దీంతో ఆ వీడియో చూసి చాలామంది ఆమెపై ఫైర్ అవుతున్నారు. అంబర్ పేట్ లో చనిపోయిన ఆ బాలుడు ఏమి చేయలేదు.. కానీ ఆ కుక్కలి ఎలా చంపాయో చూశారు కదా అంటూ తిరిగి ఫైర్ అవుతున్నారు. సైలెంట్ గా వెళ్ళిపోతున్న కూడా అవంతల అవి వచ్చి కరుస్తున్నాయి అని కొందరు వాపోతున్నారు. మరి కొంతమంది రాత్రులు డ్యూటీలు చేసి రావాలంటే భయమేస్తుంది అని.. కారులో తిరిగే మీకేం తెలుసు మా బాధలు అంటూ ఆమెపై కోపాన్ని చూపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -