Dil Raju: నిర్మాత దిల్ రాజు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Dil Raju: ఒకప్పుడు తెరపై సినిమాలు ఆడాలంటే డిస్ట్రిబ్యూటర్ల పాత్ర ఎంతగానో ఉండేది. ఆ రోజుల్లో ఒక్కో థియేటర్లలో వెయ్యి రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ల హవా నడుస్తోంది. అందులోనూ మన టాలీవుడ్ లో నిర్మాతల స్థాయి ఎక్కువ. ఇక్కడ ఏ సినిమా ఎన్ని రోజులు ఆడాలన్నది వారి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక టాలీవుడ్ లో ఆ కోవకు చెందిన ప్రొడ్యూసర్లలో టాప్ మోస్ట్ లిస్ట్ లో దిల్ రాజు ఉన్నారు.

 

నిర్మాతల సక్సెస్ రేటులో దిల్ రాజు మొదటి స్థానంలో ఉన్నారు. అటు అద్భుతమైన బిజినెస్ లో రాణిస్తూ ఇటు మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా తన బ్యానర్ మార్కెట్ ని ఇతర ఇండస్ట్రీలకు కూడా విస్తరిస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే దిల్ రాజు తమిళ స్టార్ హీరో అయిన విజయ్ తో వారిసు అనే సినిమా మొదలు పెట్టాడు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయనున్నాడు. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

తమిళంలో విజయ్ సినిమాతో పాటుగా మరో స్టార్ హీరో అయిన అజిత్ సినిమా కూడా రానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..తాను విజయ్ సినిమా కోసం మరో 50 థియేటర్లు ఎక్కువగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తమిళంలో అజిత్ కన్నా విజయ్ నెంబర్ 1 హీరో కాబట్టి విజయ్ సినిమాలే ఎక్కువగా వేయాలని దిల్ రాజు కోరారట.

 

అయితే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం విజయ్ కి సగం అజిత్ కు సగం థియేటర్లను ఇవ్వడానికి సిద్దమయ్యారట. ఇప్పుడు తమిళ వర్గాల్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అజిత్ కన్నా విజయ్ పెద్ద హీరో అంటూ దిల్ రాజు చేసిన షాకింగ్ కామెంట్స్ అటు తెలుగు, ఇటు తమిళ ఇండస్ట్రీల్లో హల్ చల్ చేస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -