Tammreddy Bharadwaja: విశ్వక్‌సేన్-అర్జున్ వివాదం.. నిర్మాత తమ్మారెడ్డి ఏం చెప్పారంటే?

Tammreddy Bharadwaja: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. హీరో అర్జున్ నటించిన ‘రాజయోగం’ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విశ్వక్‌సేన్ ఎందుకు తప్పుకున్నాడనే విషయం పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ కాంట్రవర్సీపై విశ్వక్‌సేన్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విశ్వక్‌సేన్ ప్రవర్తన, కమిట్‌మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

 

 

అయితే యంగ్ హీరో విశ్వక్‌సేన్ వల్ల తనకు, చిత్ర యూనిట్‌కు చాలా అవమానం జరిగిందని అర్జున్ చెప్పాడు. విశ్వక్‌సేన్ కమిట్‌మెంట్‌కు కట్టుబడి ఉండడని, షూటింగ్ సమయంలో విశ్వక్‌సేన్ ప్రవర్తన, అతను చేసిన పనులతో ఎంతో బాధ కలిగించాయని అర్జున్ తెలిపాడు. టాలీవుడ్‌లో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, బన్నీ వంటి స్టార్ హీరోలు ఎంతో నిబద్ధతతో పని చేస్తారని చెప్పుకొచ్చారు. దీనిపై విశ్వక్‌సేన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఈ విషయంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ..‘సీనియర్ ఎన్టీఆర్ దర్శకుడు, నిర్మాత, హీరో అయినప్పటికీ.. ఆయన ఎవరి దర్శకత్వంలో సినిమా చేసిన.. డైరెక్టర్ చెప్పినట్టుగానే చేసేవారు. డైరెక్షన్‌కు సంబంధించిన విషయాల్లో ఎలాంటి జోక్యం చేసుకునే వారు కాదు. అలాంటి నిబద్ధతే నందమూరి బాలకృష్ణలో మనం చూశాం. ఇచ్చిన కాల్‌షిట్ టైం ప్రకారమే బాలయ్య సెట్‌లో ఉండేవారు.’ అని తెలిపారు.

 

 

‘కానీ అర్జున్-విశ్వక్‌సేన్ వివాదం డిఫరెంట్‌గా ఉంది. గొడవలో అర్జున్ షూటింగ్ మొదలు పెట్టేశారు. కానీ విశ్వక్‌సేన్ కొంతవరకూ షూటింగ్ పూర్తి చేశాడు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ తన నచ్చనివి ఉన్నాయని, వాటిపై మాట్లాడాలని విశ్వక్‌సేన్ అనుకున్నాడు. అర్జున్‌కి దర్శకుడిగా కూడా అనుభవం ఉంది. సినీ ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. అర్జున్ అవుట్ డేటెడ్ అనుకుంటే.. విశ్వక్‌సేన్ ముందుగానో సినిమా మానుకోవాల్సి ఉండేది. సినిమా ఒప్పుకున్న తర్వాత సీన్స్ బాలేవు.. మాటలు బాలేవు.. పాటలు బాలేవు అంటే ఎలా? ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు డైరెక్షన్ విషయంలో ఇన్వాల్ అవుతున్నారు. అందుకే చాలా వరకు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. యువ దర్శకులు విభిన్న స్టోరీలతో ముందుకు వస్తున్నారు. కానీ హీరోలు చెప్పింది చేయడం వల్ల సినిమా ప్లాప్ అవుతున్నాయి. యంగ్ హీరోలు ఈ పద్ధతి మార్చుకోవాలి. విశ్వక్ సేన్ చేసిన పని ప్రతిఒక్కరికీ అవమానకరమే.’ అని చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -