Balayya: బాలయ్యను నమ్మి 1000 కోట్లు పెడుతున్న నిర్మాతలు.. కానీ?

Balayya: నందమూరి నటసింహం బాలకృష్ణ వీర సింహారెడ్డి ఈవెంట్లో చెంగిస్ ఖాన్ సినిమా చేస్తా అది నా జీవితాశయం కానీ టైం రావాలి అంటూ తన మనసులో మాట బయట పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మాటల్ని పట్టుకొని ఒక దర్శకుడు చంగీజ్ ఖాన్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నాడంట. నిర్మాత కూడా సిద్ధమేనంట.

అయితే ఈ సినిమాకి బి. గోపాల్ దర్శకత్వం వహిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బి. గోపాల్ గతంలో బాలయ్యతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అందుకే అతడికి మరో అవకాశం ఉండనే ఉందన్న గుసగుస అభిమానుల్లో వేడెక్కించింది.

 

అయితే వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మంగోలియనే అంటూ అనిల్ రావిపూడి పైన బాలయ్య కామెంట్ చేయడం చూస్తుంటే చంగీజ్ ఖాన్ స్క్రిప్ట్ పైన అతడు వర్కౌట్ చేస్తున్నారా అన్న సందేహం ప్రేక్షకుల్లో రేకెత్తింది. అయితే నిర్మాతగా వ్యవహరిస్తున్న కోనేరు సత్యనారాయణ బాలకృష్ణ సినిమా కోసం వెయ్యి కోట్లు వెచ్చించినట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ బాలకృష్ణ కి దర్శకుడికి అడ్వాన్సులు కూడా ఇచ్చేసారని సినీ వర్గాల సమాచారం.

 

2024 ఎన్నికలకు ముందే బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా కన్నా ముందు అనిల్ రావిపూడి తో బాలయ్య సినిమా తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత చెంగిస్ ఖాన్ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. వచ్చే ఏడాది చెంగిస్ ఖాన్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లాలన్నది బాలకృష్ణ ఆలోచన.

 

బాలయ్య మనసులో కోరిక ఏమో గాని ఆయనని నమ్మి 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్న నిర్మాతకి సినిమా అంచనాలు తారుమరైతే దబిడి దిబిడే.. చూడాలి మరి 1000 కోట్ల పెట్టుబడికి చెంగీజ్ ఖాన్ న్యాయం చేస్తుందా లేదా అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా.. కుట్రలకు బలి కామని జనం చెబుతున్నారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకు రాజుకుంటుందని చెప్పాలి. మరి 20 రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నామినేషన్లను దాఖలు చేస్తూ...
- Advertisement -
- Advertisement -