Project K: ప్రాజెక్ట్ కె మూవీ హక్కులు అంత రేటుకు అమ్ముడయ్యాయా?

Project K: బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా రూపు రేఖలు మారిపోయాయి. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతారం ఎత్తారు. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తీసి అంతర్జాతీయంగా పేరు పొందారు. తాజాగా ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా భారీ వైవిధ్యమైన సినిమా కావడం విశేషం. ప్రాజెక్ట్ కేగా ఈ సినిమాకు పేరుంది. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్ట్ కె రెండింటి మీదే ఫ్యాన్స్ ఫుల్ ఆశలు పెట్టుకుని ఉండటం విశేషం.

 

ప్రాజెక్ట్ కె విడుదలకు ఇంకా చాలా టైం ఉందని చెప్పాలి. 2024వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా సలార్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. అలాగే ఆదిపురుష్ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ కె తరువాతే పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది.

 

తాజాగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా నైజాం హక్కులను ఆసియన్ సునీల్ సారథ్యంలోని సిండికేట్ తన సొంతం చేసుకుంది. సుమారుగా 70 కోట్లకు కాస్త దగ్గరగా నైజాం హక్కుల పంపిణీని ఈ సిండికేట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖ నిర్మాతలు, సురేష్ బాబు-సునీల్ తో కలిసి ఆసియన్ గ్లోబల్ అనే పంపిణీ సిండికేట్ ను ప్రారంభించారు. గత ఏడాది సీతారామం, కార్తికేయ‌ 2, ధమాకా వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను ఈ సిండికేట్ పంపిణీ చేయడం విశేషం.

 

ఇప్పుడు ఇదే సిండికేట్ కు ప్రాజెక్ట్ కే హక్కులు దక్కడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నైజాంలోనే రూ.70 కోట్లు అంటే ఆంధ్ర, సీడెడ్ ఏ మేరకు వుంటాయో ఇప్పటికే అందరూ అంచనాలు వేశారు. ప్రాజెక్ట్ కే సినిమా భారీ వసూళ్లను సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఫ్యాన్స్ ఇప్పటికే సందడి మొదలెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -