Project K: ఆగిపోయిన ప్రభాస్ ప్రాజెక్ట్ కే.. షాకింగ్ విషయాలు రివీల్!

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది. పైగా వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే వస్తున్నాయి. దీంతో ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. కానీ ఈ మధ్య వరుస ప్లాప్స్ అందుకున్నాడు ప్రభాస్.

 

అయినా కూడా ఆయనకు మాత్రం భారీ బడ్జెట్ తో ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇక అందులో డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉంది. ఇక ఈ సినిమాకు ప్రాజెక్టు కే అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా గురించి దర్శకుడు ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో ఆయన వారి కోసం స్పందించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.

ప్రస్తుతం ప్రభాస్ 100 కోట్లకు తక్కువ కాకుండా సినిమాలు చేస్తున్నాడు అంటూ.. అందుకే ఈ సినిమా కోసం 500 కోట్లు కేటాయించే అవకాశం ఉందని అన్నాడు. ఈ సినిమా మిగతా సినిమాల కంటే డిఫరెంట్ గా ఉంటుందని.. ఈ సినిమా కోసం వాడే వస్తువులు ఎక్కడ దొరికే అవకాశం ఉండదంటూ.. స్వయంగా తామే తయారు చేసుకోవాలి అని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.

ముఖ్యంగా ఈ సినిమాలో వాడే కార్లు కూడా ఎక్కడ దొరకవు అంటూ.. అందుకే వాటిని కూడా తామే స్వయంగా తయారు చేస్తున్నామని తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం కొత్త టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు అని.. ఈ సినిమా గురించి వివరించడానికి సమయం తీసుకుంటుందని.. ప్రతి ఒక్క సన్నివేశం కాంప్రమైజ్ కాకుండా చేయాలనుకుంటున్నామని అన్నాడు.

ఇక ఈ సినిమా కొత్త లోకం కి తీసుకెళ్తుంది అంటూ.. అందుకే ప్రత్యేక సెట్ ను తయారు చేసే పనిలో ఉన్నాం అని.. ఇక ఇప్పటివరకు ఇటువంటి సినిమా రాలేదు అని.. ఈ సినిమాతో ప్రభాస్ వరల్డ్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -