Projects: ఈ స్టార్స్ ప్రాజెక్టులు అటకెయ్యాయని మీకు తెలుసా?

Projects: టాలీవుడ్ సినీ పరిశ్రమలో కొందరు హీరోల కాంబినేషన్‌లో వచ్చే సినిమాలు ఎంతో ఆసక్తి రేపుతాయి. స్టార్ హీరోల సినిమాలకైతే విపరీతమైన క్రేజ్ వస్తుంది. అయితే అనుకున్న విధంగా జరిగితే బాగానే ఉంటుంది. కానీ మధ్యలోనే బ్రేక్ పడితే.. ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. ఇటీవల వచ్చిన ప్రకటనలతో ఆసక్తి రేపిన కొన్ని క్రేజీ ప్రాజెక్టుల గురించి ఇప్పుడు ఊసే వినపడటం లేదు. ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలీదు. మధ్యలోనే బ్రేక్ పడిందా? అని అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇంతకీ ఆ సినిమాలేంటో ఒక్కసారి చూద్దామా..

 

ఆసక్తి పెంచిన ‘అచలుడు’..

డైరెక్టర్ బాల దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కాల్సిన సినిమా ‘అచలుడు’. అయితే ఇప్పటికే సూర్య నటించిన ‘శివపుత్రుడు, నంద’ సినిమాలతో బాల మంచి హిట్స్ అందించారు. దీంతో ‘అచలుడు’ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. కానీ ఈ సినిమా నుంచి సూర్య తప్పుకుంటున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో తాను అనుకున్న పాత్రకు సూర్య సెట్ కావటం లేదని డైరెక్టర్ బాల భావిస్తున్నారట.

 

భవదీయుడు భగత్‌సింగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ మంచి హిట్ అందుకుంది. అదే కాంబినేషన్‌లో భవదీయుడు భగత్‌సింగ్ తెరకెక్కుతుండటంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు పెరిగాయి. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ‘వినోదయసిత్తం’ సినిమా రీమేక్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఊసే వినిపించడం లేదు.

 

అల్లు అర్జున్ ‘ఐకాన్’..

‘పుష్ప’ సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అయితే ఈ సినిమా కంటే ముందు డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా చేయాలి. దీనిపై ప్రకటన కూడా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’ సినిమాపైనే ఫోకస్ పెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే వేరే ప్రాజెక్ట్ గురించి ఆలోచించే అవకాశం ఉంది.

 

అలాగే డైరెక్టర్ వెంకీ కుడుములతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయాలి. ఓ మలయాళ సూపర్ హిట్ మూవీకి రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌తో కొద్ది రోజులు నెట్టింట బాగానే ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయదేవరకొండ హీరోగా ‘జేజేఎం’ సినిమా చేయాలి. కానీ లైగర్ సినిమా ఫ్లాప్ వల్ల ఈ సినిమా ముందుకు సాగడం లేదు. అలాగే బుచ్చిబాబు-రామ్ చరణ్, తేజ-రానా కాంబినేషన్స్ లో సినిమాలు రావాలి. వీటిపై కూడా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -