Krishnam Raju: కృష్ణంరాజు కుటుంబంలో ఆస్తుల గొడవలు.. ఏం జరిగిందంటే?

Krishnam Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు దివంగత కృష్ణం రాజుగారు ఒకరు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజు చివరి శ్వాస వరకు ఇండస్ట్రీకి సేవలు చేస్తూ అనారోగ్య సమస్యలతో గత ఏడాది మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా కృష్ణంరాజు గారు మరణించడంతో ఆయన కుటుంబానికి ప్రభాస్ పెద్ద దిక్కుగా మారిపోయారు.

ఇక కృష్ణంరాజుకు అందరు కుమార్తెలు కాగా ఆయన తన వారసుడిగా ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ప్రభాస్ కూడా తన సొంత కొడుకులాగే కృష్ణంరాజు గారు బాధ్యతలు అన్నింటిని తీసుకున్నారు. అయితే తాజాగా కృష్ణంరాజు ఇంటిలో ఆస్తి విషయంలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆస్తి విషయంలోప్రభాస్ కృష్ణంరాజు కుమార్తెల మద్య మనస్పర్థలు వచ్చాయని సమాచారం.

 

కృష్ణంరాజు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి కృష్ణంరాజు కుటుంబం నుంచి ప్రభాస్ ను దూరం పెట్టాలన్న ఉద్దేశంతో కృష్ణంరాజు కుమార్తెలకు లేనిపోనివన్నీ చెప్పి వారిని ప్రభాస్ తో గొడవలకు వచ్చేలా చేస్తున్నారని తెలుస్తోంది.ఇక ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కనుక ఈయనకు డబ్బు పెద్ద మ్యాటర్ కాదు కానీ తన పెదనాన్నకి ఇచ్చిన మాట కోసం ఆ కుటుంబ బాధ్యతలను ప్రభాస్ తీసుకుంటున్న నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వీరిని విడదీయాలని ప్రయత్నాలు చేస్తున్నారట.

 

ఈ విధంగా కృష్ణంరాజు కుటుంబం నుంచి ప్రభాస్ ను వేరు చేయాలని చూస్తున్న నేపథ్యంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కుటుంబ విషయంలోనూ ఆస్తుల విషయంలోనూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.కృష్ణంరాజు గారి చివరి కోరిక ప్రకారం ఆ ఇంటి బాధ్యతలన్నీ కూడా ప్రభాస్ చూసుకోవాలని ఆస్తులన్నీ కూడా ప్రభాస్ పేరుపైనే ఉండాలని భావించిన శ్యామలాదేవి తన కుటుంబం ఆస్తులు బాధ్యతలు అన్నీ కూడా తనకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇలా సొంత కూతుర్లని కాకుండా శ్యామలాదేవి ప్రభాస్ ను నమ్మి తన బాధ్యతలను మొత్తం ప్రభాస్ చేతుల్లో పెట్టడంతోనే ప్రభాస్ మనసు ఎంత మంచిదో అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -