PM Modi: ఏపీ పర్యటన వేళ ప్రధాని మోదీకి నిరసన సెగ

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11,12వ తేదీలలో విశాఖలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ రైల్వే స్టేషన్ నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ.. ఆ తర్వాత ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. గత మూడు నెలల క్రితం భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు ఉత్సవాలకు హాజరైన మోదీ.. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నారు.

 

అయితే విశాఖ పర్యటన వేళ మోదీకి నిరసన సెగ తగులుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉద్యోగులు వ్యతిరేకిస్తోన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేపట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్నారు. ఆందోళనలు కూడా చేపడుతోన్నారు. ఇప్పుడే ప్రధాని మోదీ విశాఖ వస్తున్న వేళ ఆయనకు తెలిసేలా ఆందోళనలకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు ఆందోళనలకు శ్రీకారం  చుట్టారు. గురువారం ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో భారీ ర్యాలీకి సిద్దమవుతోన్నారు.

 

మోదీకి తెలిసేలా భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు స్పష్టం చేశారు. అటు వామపక్ష పార్టీలు కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టనుంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగనుంది. మోదీ పర్యటనపై వామపక్షాలు భగ్గుమంటున్నాయి. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చని మోదీ.. ఏ మొఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తోన్నాయి. మోదీ పర్యటనను అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తోన్నాయి. విశాఖ వస్తున్న మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడాలని కోరుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామంటూ మోదీ ప్రకటించాలని డిమాండ్ చేస్తోన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనలకు వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -