Prudhvi Raj: రియల్ క్యారెక్టర్ ను బయటపెట్టిన పృథ్వీ.. అలా చెబుతూ?

Prudhvi Raj: కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ ఫేమ్ పృథ్వీ రాజ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామెడీతో పాటు అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు పృథ్వీ రాజ్. మొన్నామధ్య ఏపీలో అధికార పార్టీ వైసీపీలో చేరిన ఆయన.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ లో కీలక బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే అపవాదు మూటగట్టుకొని పదవి నుంచి తొలగించేలా చేసుకున్నారు.
వ్యక్తిగత జీవితంలోనూ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు పృథ్వీరాజ్. భార్యతో దూరంగా ఉంటున్నానని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు. తాజాగా విజయవాడలోని కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని తీర్పు కూడా వెలువరించింది. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా విషయాలు వెల్లడించారు.
తెలుగుతో పాటు తమిళంలోనూ పృథ్వీ రాజ్ అనేక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లోనే 40కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. కామెడీతో పాటు నెగిటివ్ రోల్స్ లోనూ నటించారు. పెళ్లి సినిమాలో విలన్ పాత్రలో నటించి బాగా గుర్తింపు పొందారు. అనంతరం పెళ్లి పందిరి, పెళ్లాడి చూపిస్తా, దీర్ఘ సుమంగళీభవ లాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. అయితే, ఇటీవల 24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
కూతురు వయసున్న అమ్మాయితో అలా చేస్తారా..
57 ఏళ్ల వయసులో కూతురు లాంటి అమ్మాయితో రొమాన్స్ ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలో ఈ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోబుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆమెతో పిల్లల్ని కూడా కనాలని ప్లాన్ చేస్తున్నాడట పృథ్వీ. ఈ విషయాన్ని పృథ్వీనే స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మీకు ప్రతిరోజూ పడక సుఖం కావాలా అనే ప్రశ్నకు.. అవును.. నేనింకా ఫిట్ గానే ఉన్నాను.. రోజూ పడక సుఖం కావాలి.. అని బోల్డ్ కామెంట్లు చేశాడు పృథ్వీరాజ్. దీంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -