PS1: బాహుబలిని మించి ఉంటుందన్నారు.. అసలు హైపే లేదుగా!

PS1: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా భారీ తారాగణంతో సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచడంతో ఈ సినిమా బాహుబలి సినిమా రికార్డులను చెరిపేస్తుంది అంటూ కోలీవుడ్ మీడియా షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ సినిమా ఎప్పటికీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఈ సినిమా రికార్డులను ఇప్పటివరకు ఏ సినిమా చెరిపి వేయలేదు. అయితే మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా బాహుబలి సినిమా రికార్డులను చెరిపేస్తుందని తమిళ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి తెలుగు ఆడియన్స్ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో బాహుబలి సినిమా రికార్డులను ఏ సినిమా చెరిపి వేయలేదని అయితే పొన్నియన్ సెల్వన్ సినిమా మాత్రం ఈ సినిమా రికార్డులను చెరిపే వేస్తుందన్నారు కానీ ఈ సినిమాకి అలాంటి బజ్ ఏమాత్రం ఏర్పడలేదని, ఈ సినిమాని ఇప్పటికీ అన్ని సినిమాల మాదిరిగానే ఓ డబ్బింగ్ సినిమాగానే తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారని ఒక తమిళంలో మినహా ఈ సినిమాకి ఎక్కడ హైప్ రాలేదంటూ తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇలాంటి ఒక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా పలు భాషలలో సినిమా విడుదలవుతున్న సమయంలో పెద్ద ఎత్తున అన్ని భాషలలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తేనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందని,ఈ సినిమా విడుదలవుతుందన్న పది రోజుల ముందు నుంచి చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారే తప్ప ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారంటూ పలువురు భావిస్తున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ఈ సినిమా అన్ని భాషలలో హిట్ అవ్వడం చాలా కష్టతరం అంటూ పలువురు ఈ సినిమాపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Vanga Geetha: వైసీపీ వంగా గీతకు ప్రజల్లో తిరస్కారం వెనుక అసలు లెక్కలివేనా.. ఏం జరిగిందంటే?

Vanga Geetha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అందరూ చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కాపు...
- Advertisement -
- Advertisement -