Gedela Srinubabu: టీడీపీలోకి గేదెల శ్రీనుబాబు.. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ అయితే తప్పదా?

Gedela Srinubabu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జప్పింగ్ జపాంగ్‌లు పెరిగిపోతున్నారు. అన్ని పార్టీల్లో ఇది కామన్‌గా ఉన్నా.. అధికార వైసీపీ నుంచి ఎక్కువ మంది పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికమైన అంశం ఏంటంటే.. వైసీపీ నుంచి అన్ని పాంతాల వాళ్లు దూరం జరుగుతున్నారు. దీంతో.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన అన్ని ప్రాంతాల్లో బలపడుతున్నాయి. ఇప్పుడు ఏపీలో కీలకమైన నేత వైసీపీని వీడుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన గేదెల శ్రీను అనే వ్యాపారవేత్త వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు.. టీడీపీలో చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉత్తరాంధ్రలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. రైతుల ఆధాయాన్ని పెంచే మార్గాల కోసం ఆయన సభలు, సమావేశాలు పెడతారు. రైతులతో మాట్లాడుతారు.

అంతేకాదు.. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయన జనసేనలో చేరి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో వైసీపీలో చేరారు. ఎక్కడ నుంచి పోటీ చేయకపోయినా.. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపునకు గట్టిగా కృషి చేశారు. ఎన్నికల తర్వాత వైసీపీ అధిష్టానం ఆయనకు ప్రాధాన్యతనివ్వలేదు. దీంతో.. ఆయన కూడా పార్టీతో అంటీ మట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు.

గత కొంతకాలంగా సైలంట్ గా ఉన్న గేదెల శ్రీను ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, ఉత్తరాంధ్రలో జరుగుతున్న శంఖారావం సభకు ఆయన హాజరైనట్టు తెలుస్తోంది. టీడీపీ యువనేత లోకేష్‌తో భేటీ అయ్యారని సమాచారం. ఇప్పటికే ఆయన టీడీపీలో చేరికపై ఓ క్లారిటీకి వచ్చారట. ఉత్తరాంధ్రలో కీలక నేతలైన అశోక్ గజపతిరాజు, కిమిడి కళావెంకటరావు లాంటివారితో ఆయన టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో టీడీపీ, జనసేన కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయి. కానీ, బొత్స సొంత జిల్లా అయిన విజయనగరంలో నువ్వా నేనా అన్నట్టు పోరు ఉంది. ఇప్పుడు గేదెల శ్రీను టీడీపీలో చేరితే ఇక తిరుగుండదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ ఉత్తరాంధ్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే జగన్ మూడు రాజధానుల పేరులో చేసిన నాటకం రక్తి కట్టింది. ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని కడితే చంద్రబాబుకు ఇష్టం లేదని జగన్ పలు సార్లు విమర్శించారు. అయితే, చంద్రబాబు మాత్రం విశాఖను అన్ని రకాలుగా అభివృద్ది చేస్తామని చెబుతూనే.. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని అన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మెజారిటీ స్థానాలను గెలుచుకొని ఆ ప్రాంత ప్రజలు అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని టీడీపీ నిరూపించాలని చూస్తోంది. దాని కోసం వచ్చిన వారికి కలుపుకొని వెళ్తుంది. ఏది ఏమైనా ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాలు ఉన్నారు. అక్కడ 25 స్థానాలకు పైగా గెలవాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -