R Narayana Murthy: మూడు కోట్ల రూపాయలను తీసుకోకుండా ఈజీగా తీసి పారేసిన ఆర్. నారాయణమూర్తి!

R Narayana Murthy: టాలీవుడ్ ప్రేక్షకులకు ఆర్.నారాయణమూర్తి పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లోని నటించి నటుడుగా తనకంటూ చెరగని గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం నటుడు గానే కాకుండా ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన విప్లక విప్లవ సినిమాల నిర్మాత కూడా చేశాడు. అలా నారాయణమూర్తి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇతడిలో ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఇతడికి పేదలంటే చాలా జాలి. కనుక పేదలకి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ పేదలకు పంచడానికి తన దగ్గర డబ్బు లేదు. అందుకని తనకు నచ్చిన సినిమాల పరంగా కమ్యూనిస్ట్ కి సంబంధించిన సినిమాలు చేస్తూ పేదలకు సినిమా రూపంలో జ్ఞానం కలిగిస్తూ ఉండేవాడు. తను చేసే సినిమా పేదలకు అవగాహన రూపంలో ఎంతో కొంత ఉపయోగపడాలని ఆలోచిస్తూ ఉండేవాడు.

ఒకానొక సమయంలో నక్సలిస్టులకు కూడా తాను సపోర్టివ్ గా ఉన్నట్లు కొన్ని సినిమాలు తీసి ప్రేక్షకులకు అవగాహన కలిగించాడు. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆర్.నారాయణమూర్తి కి కాల్ చేసి టెంపర్ సినిమాలో పోసాని కృష్ణ మురళి పాత్రను నారాయణమూర్తిని చేయమని అడిగాడట. దీనికి గాని ఒక చెక్కు పంపించి మీకు ఒక కోటి కావాలా మూడు కోట్లు కావాలా ఎంతైనా రాసుకోండి కానీ మీరు ఆ సినిమాలో నటించాలని పూరి అడిగాడట.

పూరి అంత ఆఫర్ చేసిన కూడా ఆర్.నారాయణమూర్తి డబ్బుకు ఏమాత్రం లొంగలేదట. ఆ విధంగా ఆ సినిమాలో చేయనని తెలిపాడట. ఎందుకంటే నేను ఎప్పుడూ ప్రజల సేవలోనె ఉంటాను, ప్రజలకు ఉపయోగపడే సినిమాలే తీస్తాను అని తెలిపాడట. ఇక నేను చనిపోయే వరకు అలాగే ఉంటాను అని అన్నాడట. ఆ విధంగా ఆర్.నారాయణమూర్తి పూరి జగన్నాథ్ ఆఫర్ చేసిన సినిమాలు తిరస్కరించి ఆ డబ్బులు కూడా వద్దన్నాడట. ప్రస్తుతం కొంతకాలంగా ఆర్.నారాయణమూర్తి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -