Radhika Apte: అలా కనిపిస్తేనే ఆఫర్లు వస్తాయి: రాధికా ఆప్టే

Radhika Apte: రాధిక ఆప్టే.. స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు హిందీ, తమిళ్, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్, తెలుగు భాషా సినిమాల్లో నటించారు. 2005లో ‘వా.. లైఫ్ హో తో ఎయ్‌సీ’ హిందీ సినిమాతో తెరంగేట్రం చేశారు. రక్తచరిత్ర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ.. భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెను ఆదరించారు. తెలుగులో.. ‘రక్త చరిత్ర-2, ధోని, లయన్, లెజెండ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యువ నటీమణులే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రాధిక సంచలన వ్యాఖ్యలు చేసింది. వయసు వల్ల యువ హీరోయిన్లకు ఆఫర్ల పెరగడం.. సీనియర్ నటీమణులకు ఛాన్సులు తగ్గుతున్నాయని పేర్కొంది.

 

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘హీరోయిన్లకు ఆఫర్స్ రావడంలో వయసు కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే చాలా వరకు సినిమాల్లో యువ హీరోయిన్లే కనిపిస్తున్నారు. చాలా మంది డైరెక్టర్లు హీరోయిన్లకు దగ్గట్లే స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారు. సినిమాలో పాత్రను బట్టి హీరోయిన్ల శరీర ఆకృతి, లుక్స్, ఏజ్ అవసరం. అప్పుడే సినిమాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ స్క్రిప్ట్ కు సెట్ కాకపోతే.. హీరోయిన్‌కు కావాల్సిన లక్షణాలు మీలో లేవని చెబుతుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు సర్జరీలు చేసుకున్నారు. టాలెంట్ ఉంటే సరిపోదు.. లుక్స్ కూడా ఇంపార్టెంట్‌టే. ఇలాంటివి భారత్‌లోనే కాకుండా.. విదేశాల్లోనూ చూస్తుంటాం. దీనికి వ్యతిరేకంగా సినీ నటీమణులు ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు.’ అని ఆప్టే తెలిపింది.

 

 

‘లయన్’ సినిమా తర్వాత రాధిక ఆప్టే టాలీవుడ్‌కి దూరమైంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ప్రస్తుతం రాధిక.. ‘మౌనిక ఓ మై డార్లింగ్’ సినిమాలో నటిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఇందులో పోలీస్ పాత్రలో రాధిక ఆప్టే నటించింది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -