Ragi flour: షుగర్ పేషెంట్లకు రాగి పిండి సంజీవని.. ఎలా అంటే?

Ragi flour: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో డయాబెటిస్ సమస్య అనేది వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం చిన్న వయసు వారికి కూడా ఈ డయాబెటిస్ సమస్య వస్తోంది. అయితే ఈ డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి మెడిసిన్స్ ని చిట్కాలలో పాటించినప్పటికి కేవలం అది తాత్కాలిక మాత్రమే. ఎందుకంటే డయాబెటిస్ సమస్య ఒక్కసారి వచ్చింది అంటే చాలు చచ్చేవరకు పోదు.

అయితే డయాబెటిస్ సమస్యపై వైద్యులు నిపుణులు ఏళ్ళ తరబడి ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. డయాబెటిస్ ను పూర్తిగా నియంత్రించే మందులు లేకపోయినప్పటికీ అదుపులో ఉంచుకోవడానికి అనేక రకాల మందులు చిట్కాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడే వాటిలో రాగులు లేదా రాగి పిండి ఒకటి. రాగుల వల్ల డయాబెటిస్ బాధితులకు ఊరట లభిస్తుంది. రాగుల్లో అమైనో యాసిడ్, లెసిథిన్,మేథినోన్ కలిగి ఉండి. కాలేయంలోని అదనపు కొవ్వును తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి సహాయపడుతుంది. షుగర్ తో బాధపడుతున్నవారు గోధుమ పిండికి బదులు రాగి పిండిని తీసుకోడం మంచిది.

 

ఇలా చేయడం వల్ల మధుమేహమే కాదు ఊబకాయం, అధిక రక్తపోటు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రాగి పిండి కేవలం షుగర్ కి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. రాగుల్లో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్ డి, ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. అలాగే షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడానికి రాగులు బాగా సహాయపడతాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తినడం ద్వారా శరీరంలో రక్తం కొరత లేకుండా చేస్తుంది. రాగులు గుండె బలహీనత ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో ఉన్నవారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. రాగి పిండిలో శరీరానికి అవసరమైన ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది. అయితే ఇతర ఆహార పదార్థాలతో పోల్చుకుంటే రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల తిన్న ఆహార పదార్థాలు కూడా తొందరగా జీర్ణం అవుతాయి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -