TRS-Congress: టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ

TRS-Congress: కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ దూకుడుకి బ్రేక్ వేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయనే ప్రచారం బలంగా జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్, టీఆర్ెస్ పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ గతంలో వరంగల్ లో డిక్లకేషన్ ప్రకటించినప్పుడు టీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండదంటూ చెప్పుకొచ్చారు. అయినా టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు గురించి ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలో టీఆర్ఎస్ తో పొత్తుపై మరోసారి రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు ఎట్టిపరిస్ధితుల్లో ఉండదని రాహుల్ తేల్చిచెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ రాహుల్ మరోసారి తెలిపారు. గతంలో వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఇదే విషయం చెప్పిన రాహుల్.. ఇప్పుడు మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు అంటూ వస్తున్న వార్తలను బ్రేక్ పడింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ లో రాహుల్ పాదయాత్ర నిర్వహించారు.

సోమవారం పాదయాత్ర ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టకోకూడదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుందని, వారి నిర్ణయాన్ని స్వాగితిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ రాహుల్ జోస్యం చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజాధనాన్ని దొచుకుంటున్నాయని, మునుగోడు ఉపఎన్నికలో కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంపై రాహుల్ స్పందించారు. ఎవరికి వాళ్లు తమంది గ్లోబల్ పార్టీ అని ప్రచారం చేసుకోవడంలో తప్పు లేతంటూ సెటైర్లు వేశారు.

భారత్ జోడో యాత్రలో ఎప్పుడో చేయాలని తాను భావించానని, కానీ ఆ తర్వాత కోవిడ్ పరిస్థితులు రావడం వల్ల చేయలేకపోయానన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని, భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదన్నారు. భారత్ జోడో యాత్ర పొలిటికల్ యాత్ర అని రాహుల్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తమది జాతీయ పార్టీ అని చెప్పుకోవడంలో అర్ధం లేదని రాహుల్ విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే టీఆర్ఎస్ తో తాము పొత్తు పెట్టుకోమని రాహుల్ స్పష్టం చేశారు. అవినీతి, ప్రజాధనాన్ని దొచుకునే పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని రాహుల్ చెప్పారు.

గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలుస్తుందని రాహుల్ జోస్యం చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తోన్నట్లు తెలిపారు. దేశ సమైగ్రత కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతన్నానని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాహుల్ తెలిపారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకోవంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏ పార్టీ ఎలా అయినా తమ పార్టీని మార్చుకునే హక్కు ఉందన్నారు. కేసీఆర్ అంతర్జాతీయ పార్టీని కూడా నడుపుతున్నారు అనుకుంటే.. అమెరికా, చైనా ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చు కదా అని రాహుల్ సెటైర్లు పేల్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తుల మధ్య జరిగే పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. మునుగోడు ఉపఎన్నికలో లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి బీజేపీ, టీఆర్ఎస్ కు డబులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీకి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చిందని, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారని రాహుల్ ఆరోపించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -