Rahul Gandhi: వైసీపీతో పొత్తుపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

Rahul Gandhi: భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజులుగా ఏపీలో రాహుల్ పాదయాత్ర జరుగుతోంది. బుధవారం కర్నూలు జిల్లాలో రాహుల్ పాదయాత్ర జరిగింది. ఈ నెలలో అనంతపురం జిల్లాలో జరగ్గా.. ఇప్పుడు కర్నూలులో రాహుల్ పాదయాత్ర చేస్తోున్నారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. పాదయాత్ర మధ్యలో కర్నూలులోని ఆర్ట్స్ కాలేజీలో రాహుల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఏపీలోని రాజకీయ పరిణామాలు, ఇష్యూలు, దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా పొత్తులపై కూడా రాహుల్ స్పందించారు. గత లోక్ సభ ఎన్నికల్లో జాతీయ స్థాయితో పాటు తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి టీడీపీ పోటీ చేసింది. కేసీఆర్ వ్యతిరేకంగా మహాకూటమి తరపున చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేశారు. ఇక జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పొత్తులపై ఈ మీడియా సమావేశంలో రాహుల్ స్పందించారు. జాతీయ స్థాయిలో వైసీపీని కలుపుకుంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పొత్తులపై తాను ఏం చెప్పలేనని, దీనిపై పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయమని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది రాష్ట్ర నేతలదే నిర్ణయమని, తమ పార్టీలో అలాంటి విధమైన మద్దతి ఉందని రాహుల్ చెప్పారు. ఇందులో తన ప్రమేయం ఏమీ ఉండని, రాష్ట్ర నేతలు, జాతీయ అధ్యక్షుడు కలిసి నిర్ణయం తీసుకుంటారని రాహుల్ స్పష్టం చేశారు.

పార్టీలో తన పాత్ర ఏంటనేది కాంగ్రెస్ అధ్యక్షుడే నిర్ణయిస్తారని రాహుల్ తెలిపారు. తాను రాజకీయంగా ఎలా ముందుకెల్లాలనేది అధ్యక్షుడే నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ చెప్పారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా.. ఈ సారి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు రాహుల్ సమాధానం ఇవ్వుండా దాటవేత ధోరణి అవలంభించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. పొత్తుల అంశం తన పరిధిలోని కాదని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని రాహుల్ చెప్పుకొచ్చారు.

తాము అధికారంలోకి వస్తే ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని రాహుల్ గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదాపైనే పెడతామంటూ రాహుల్ తెలిపారు. రాష్ట్ర విభజన అంశాన్ని వదిలేసి భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మోదీపై రాహుల్ విమర్శలు కురిపించారు. మోదీ అసలు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టారా అని రాహుల్ ప్రశ్నించారు. ఇక ఏపీలోని మూడు రాజధానుల వ్యవహారంపై రాహుల్ స్పందించారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదని, ఏపీకి రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్నారు.

అమరావతి రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రాజధాని రైతులకు తాము అండగా ఉంటామన్నారు. తమ పార్టీ వారి తరపున పోరాటం చేస్తుందన్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -