Rahul Sipligunj: కీరవాణి గురించి రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Rahul Sipligunj: తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. రాహుల్ కూడా తన తండ్రితో కలిసి ఆ బార్బర్ షాప్ లో పని చేసేవాడట. ఇక చిన్నప్పటి నుంచే సంగీతం పై ఆసక్తి ఉండడంతో స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలు పై కర్రలతో వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పడేవాడట. ఆ తర్వాత తనకు పాటల జీవితం ఇచ్చిన వ్యక్తి మాత్రం ఆయనే అని చెప్పారు రాహుల్.

 

మెుదట డబ్బింగ్ సినిమాలకు కోరస్ పడే అవకాశాలు అందుకున్నాడు. అలా కోరస్ పడుతున్న సమయంలో తన వాయిస్ బాగుంది అని కొందరు వ్యక్తులు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లకు పరిచయం చేసేవారు. ఆ నేపథ్యంలోనే నాగచైతన్య డెబ్యూట్ మూవీ జోష్ లో ఫుల్ సాంగ్ పడే అవకాశం అందుకున్నాడు. ఆ సినిమాలో పాడిన ‘కాలేజీ బుల్లోడా’ సాంగ్ తనకి ఒక సంతకం లాంటిది అంటూ రాహుల్ చెబుతుంటాడు. ఇక ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడు.

కీరవాణికి రాహుల్ వాయిస్ నచ్చడంతో, తన కోరస్ టీంలో అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత ఎన్టీఆర్ దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ సాంగ్ పడే అవకాశం ఇచ్చాడు కీరవాణి. ఆ పాటతో రాహుల్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక అక్కడి నుంచి రాహుల్ అసలు కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత మణిశర్మ సంగీత దర్శకత్వంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా పాడాడు. ఇక అలానే పలు సినిమాల్లో పాడుతూనే ఉన్నారు. ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో పాట కూడా పాడేశారు. ఇప్పుడు ఆ పాటకు ఆస్కార్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనింతటికి తన కెరీర్ కు కీరవాణి గారే కారణమని రాహుల్ ఉంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -