Raj Tharun: రాజ్ తరుణ్ దరిద్రానికి ఆ స్టార్ ప్రొడ్యూసర్ కారణమా?

Raj Tharun: తక్కువ కాలంలో యంగ్ హీరోల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్. యూత్ కు కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేసి, ఇప్పుడు మాత్రం హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా రాజ్ తరుణ్ ఎదురుచూస్తున్నాడు. కథలో పస లేని సినిమాలు చేసి.. జనాలలో బ్యాడ్ ఇంప్రెషన్ కొట్టేసిన రాజ్ తరుణ్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

 

 

రాజ్ తరుణ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చేసిన ఓ తప్పు అతడిని ఈ స్థితికి తెచ్చిందనే టాక్ నడుస్తోంది. ఓ నిర్మాత ఇచ్చిన ఆఫర్ కోసం రాజ్ తరుణ్ కక్కుర్తి పడ్డాడని, దాని వల్ల ఇప్పుడు అతడి కెరీర్ పూర్తిగా అదోగతి పాలైందని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. అంతలా రాజ్ తరుణ్ ఏం కక్కర్తి పడ్డాడు, ఆ నిర్మాత ఎవరో తెలుసుకుందాం.

 

రాజ్ తరుణ్ కెరీర్ కాస్త బెటర్ గా ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ అనిల్ సుంకరతో కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమా చేస్తున్నాడు.. అదే సమయంలో మరో రెండు సినిమాల కథలు రాజ్ తరుణ్ కు నచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలను కూడా అనిల్ సుంకర నిర్మిస్తానని చెప్పడంతో రాజ్ తరుణ్ ఓకే చెప్పాడట. అయితే ఇందుకోసం అనిల్ సుంకర రాజ్ తరుణ్ కు ఓ విల్లాను గిఫ్ట్ గా ఇచ్చాడట.

 

అనిల్ సుంకరతో రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా చేసిన తర్వాత వరుసగా అంధగాడు, రాజుగాడు సినిమాలు చేశాడు. అయితే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోల్తా పడ్డాయి. దీంతో రాజ్ తరుణ్ కు అవకాశాలు తగ్గాయి. అయితే కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా తర్వాత ‘శతంమానం భవతి’ సినిమాలో హీరోగా రాజ్ తరుణ్ కు అవకాశం రాగా.. అప్పటికే అనిల్ సుంకరతో అంధగాడు, రాజుగాడు సినిమాలు ఒప్పుకొని ఉండటంతో ఆ ఛాన్స్ మిస్ అయ్యాడట.

 

అయితే ఈ వ్యవహారంలో రాజా రవీంద్ర ప్రమేయం కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాగా దీనిపై హీరో రాజ్ తరుణ్ స్పందిస్తూ.. ‘విల్లా ఇస్తారని ఆశపడి 3 సినిమాలు చేయలేదు. అనీల్ సుంకర నాకు విల్లా ఆఫర్ ఇవ్వలేదు. నిజానికి ఆ విల్లా తీసుకునే టైమ్ కి 3 సినిమాలూ సెట్స్ పై ఉన్నాయి. అప్పటికే నేను కొంత రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాను. డబ్బులిస్తే నేను వెంటనే ఖర్చు పెట్టేస్తున్నానని రాజా రవీంద్ర అలా సెట్ చేశారు. అనీల్ సుంకర తో ముందు ఒక సినిమానే అనుకున్నాం. ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే, వరుసగా మరో 2 కథలొచ్చాయి. అవి కూడా తనే చేస్తానన్నారు అనీల్ సుంకర. ఆ టైమ్ లో ఒకేసారి ఎక్కువ డబ్బు వస్తే నేను ఖర్చుపెట్టేస్తానని, అనీల్ సుంకరతో నాకు విల్లా ఇప్పించాడు రాజారవీంద్ర. విల్లా కోసం ఆ 3 సినిమాలు చేయలేదు. ఆ సినిమాలు చేసే క్రమంలో విల్లా వచ్చింది. ఇప్పుడు ఆ విల్లాలోనే ఉంటున్నాను’ అని వివరణ ఇచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -