Rajamouli: హీందీ సినిమాలు ఆడకపోవడానికి కారణమేంటో చెప్పిన రాజమౌళి

Rajamouli: గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలు సరిగా ఆడటం లేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలు ఆడకపోవడానికి గల కారణాలను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెలిపారు. పాపులర్ సినిమా తీయడానికి కావాల్సిన అర్హతలను కూడా ఆయన వివరించారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అన్నట్లుగా ఉండేదని, నేడు టాలీవుడ్ ఆ స్థానాన్ని భర్తీ చేసిందని రాజమౌళి తెలిపారు. 2022లో ఆర్ఆర్ఆర్‌, కేజీఎఫ్‌ 2, విక్రమ్‌, కాంతారా, కార్తికేయ వంటి సినిమాలు నార్త్ లో మంచి హిట్ సాధించాయని తెలిపారు.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన హిందీ సినిమాల వరుస వైఫల్యాలకు గల కారణాన్ని తెలిపారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కార్పొరేట్లు రావడం, వాళ్లు నటీనటులకు, డైరెక్టర్లకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడం వల్లే సక్సెస్ సాధించాలనే తపన లేకుండా పోతోందన్నారు. సౌత్ లో ఆ పరిస్థితి లేదని, టాలీవుడ్ లో ఈదాలి లేదంటే మునగాలి అని అన్నారు. సౌత్ సినిమాలు ఇప్పుడు బాగా ఆడుతున్నాయని, ఇలాంటి సమయంలో ఉదాసీనంగా ఉండకుండా మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

 

సినిమాకు సీక్రెట్ ఫార్ములాలు అనేవి లేవని, సినిమా ఆడాలంటే ముందు ఆడియన్స్ కు కనెక్ట్ కావాలని తెలిపారు. రెండోది మరీ సుఖంగా, సౌకర్యవంతంగా సినిమా చేస్తుంటే విజయాలు రావన్నారు. ప్రతి సినిమాలో అందరూ కష్టపడాలని, హీరోనే ముఖ్యంగా కష్టపడాలని తెలిపారు. ఇప్పుడు హిందీలో సెలబ్రిటీలు సౌకర్యవంతంగా సుఖంగా ఏ ఇబ్బంది లేకుండా సినిమాలు చేయాలని అనుకుంటున్నారని, అది తప్పని రాజమౌళి తెలిపారు.

 

సౌత్ ఇండస్ట్రీల్లో హీరోని ఇబ్బంది పెట్టైనా సరే తమకు తగిన ఇన్ పుట్ ను రాబట్టుకుంటారని, అది మంచి పరిణామమని అన్నారు. ప్రస్తుతం సౌత్ సినిమాలు దూసుకుపోతున్నాయని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా ఉండకూదని తెలిపారు. ఆడియన్స్ కు కనెక్ట్ కావాలంటే వాళ్లు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, అదే దర్శక, నిర్మాతలకు ముఖ్యమైన విషయమని ఎస్ ఎస్ రాజమౌళి తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -