Rajanna Sirisilla: రాజన్న సిరిసిల్లలో యువతి కిడ్నాప్ కలకలం.. ఊహించని ట్విస్ట్!

Rajanna Sirisilla: తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున చందుర్తి మండలం మూడపల్లిలో కొందరు దుండగులు కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేశారు. పూర్తి వివరాలలోకి వెళ్తే.. మూడపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య తన కూతుర షాలినిని తీసుకుని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం గుడి నుంచి బయటికి వస్తుండగా.. కొందరు దండుగులు కారులో వచ్చారు. చంద్రయ్యను దూరంగా నెట్టి షాలినిని కిడ్నాప్ చేశారు. దీంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీలో ఫుటేజీని బయటపడటంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది.

 

 

ఇలాంటి తరుణంలో షాలిని సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, జానీని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఇష్టపూర్వకంగానే ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు షాలిని తెలిపింది. గతంలో తాము పెళ్లి చేసుకున్నామని చెప్పింది. కానీ అప్పుడు మైనర్లు కావడంతో వివాహం చెల్లదని తన తల్లిదండ్రులు జానీపై కేసు పెట్టారని పేర్కొంది. ప్రస్తుతం తాను మేజర్ కావడంతో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. ఈ క్రమంలో మరో యువకుడితో ఈ నెల 19న నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పుడే జానీకి తానే కాల్ చేసి తీసుకెళ్లమని చెప్పినట్లు షాలిని వెల్లడించింది. అయితే తనను తీసుకెళ్లే క్రమంలో జానీ, అతని స్నేహితులు మాస్కులు ధరించారని, అందుకే అందరూ కిడ్నాప్‌గా భావిస్తున్నారని పేర్కొంది. ఇష్టానుసారంగానే బయటికి వచ్చినట్లు.. మంగళవారం కొండగట్టులో ఇద్దరికీ పెళ్లి కూడా జరిగినట్లు తెలిపింది. దీంతో యువతి కిడ్నాప్ కథ పెళ్లితో సుఖాంతమైంది.

 

 

కాగా, కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పటికే జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఫుల్ సీరియస్ అయ్యారు. ఎస్పీ రాహుల్‌ను పిలిపించుకుని కిడ్నాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కేసును సాయంత్రంలోపు ఛేదించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకుంటున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులనెవరినీ వదిలి పెట్టొద్దని వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ కు ఆ ఎన్నికలంటే భయమా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఏపీలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి జగన్ సర్కారు వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్నికల గురించి...
- Advertisement -
- Advertisement -