Rajeev Kanakala: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడే.. రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్ వైరల్!

Rajeev Kanakala: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వారసుడిగా పార్టీలో కొనసాగే పూర్తి హక్కులు అధికారాలు ఎన్టీఆర్ కు ఉన్నాయని చెప్పాలి అయితే గతంలో తన తండ్రి ఉన్నప్పుడు పార్టీ కోసం ప్రచార కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం పార్టీకి దూరంగా ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత ఎన్టీఆర్ రంగంలోకి దిగితే పార్టీ పుంజుకుంటుందని చాలామంది భావించారు కానీ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబునాయుడు అరెస్టు గురించి కూడా స్పందించిన దాఖలాలు లేవు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ఎన్టీఆర్ మౌనంగా ఉండడం పట్ల ఎంతోమంది ఆయన పై విమర్శలు చేశారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయాల గురించి అలాగే చంద్రబాబు విషయంలో వహిస్తున్న మౌనం గురించి నటుడు ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుడు రాజీవ్ కనకాల స్పందించారు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కి రాజకీయ వారసత్వం ఉంది ఆయనకు రాజకీయాలపై కూడా చాలా ఆసక్తి ఉంది ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాలలోకి వస్తారని తెలిపారు.

ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడం పక్కా కానీ దానికి మరికాస్త సమయం పట్టవచ్చని ఈయన తెలియచేశారు. ఆయనకు రాజకీయ అనుభవం ఉంది అలాగే రాజకీయాలపై కూడా ఆసక్తి ఉందని అయితే ప్రస్తుతం సినిమాల పరంగా ఈయన బిజీగా ఉన్న నేపథ్యంలోనే రాజకీయాల గురించి ఆలోచించలేదని అయితే భవిష్యత్తులో తప్పకుండా ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తారని రాజీవ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు ఈ విషయం గురించి కూడా రాజీవ్ మాట్లాడుతూ . ఎన్టీఆర్ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో తనకు తెలియదని తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని ఒకవేళ ఏదైనా అనుకొని ఉంటే నాకు చెప్పేవారు అయితే ఈ మధ్యకాలంలో తాను ఎన్టీఆర్ ని కలవలేదని అందుకే ఈ విషయం గురించి తనకు స్పష్టత లేకపోవడంతో మాట్లాడటం కూడా మంచిది కాదు అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -