Rajinikanth: ఆ నిర్మాతకు భారీ నష్టం తెచ్చిన రజనీకాంత్.. ఏం జరిగిందంటే?

Rajinikanth: నట్టి కుమార్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు. ఏ విషయం మీదైనా తన అనుకున్నది చెప్పేయడం ఆయన నైజం. కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడ్డా కూడా నట్టి కుమార్ తన వైఖరి మార్చుకోలేదు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లని తగ్గించినప్పుడు మద్దతు తెలిపిన అతి తక్కువ మంది ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు. నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా నట్టి కుమార్ ఫేమస్. ఆయన కొన్నిపెద్ద సినిమాలను కూడా తెలుగులో పంపిణీ చేశారు.

 

రజినీకాంత్ చిత్రాన్ని పంపిణీ చేసి భారీ నష్టాలు మూటకట్టుకున్న నిర్మాత..
గతంతో పోలిస్తే నట్టి కుమార్ కొద్దిగా నెమ్మదించారనే చెప్పాలి. ఇంతకు ముందులా సినిమాలు నిర్మించడం కానీ పంపిణీ చేయటం కానీ చెయ్యట్లేదు. చిన్న సినిమాలు ఎదుర్కునే సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు నట్టి కుమార్.

 

ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రస్థానం గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు నట్టి కుమార్. సినిమా పంపిణీ అంటే నష్టాలూ లాభాలూ రెండూ ఉంటాయని చెప్పారు ఆయన. రజినీకాంత్ లింగా చిత్రం గురించి మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల పై చిలుకు నష్టం కలిగిందని అన్నారు.

 

పంపిణీదారుడిగా తీసుకున్న నిర్ణయాల మీద లక్ ఫ్యాక్టర్ ఎలా ప్రభావం చూపుతుందో చెప్పడానికి లింగా చిత్రాన్ని ఒక ఉదాహరణగా చెప్పారు నట్టి కుమార్. ఆయన చెప్పింది ఏంటంటే రజినీకాంత్ చిత్రానికి ఎక్కువ డబ్బులు ఖర్చుచేశారట. తెలుగు హక్కుల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుచేయడంతో బాగా నష్టాలు వచ్చాయట. దీనికి కారణం ఇస్తూ ఈ ప్రముఖ నిర్మాత ఏం అన్నారంటే అప్పట్లో ఆ చిత్రానికి బాగా క్రేజ్ ఉండేదట. హక్కుల కోసం పంపిణీదారులు పోటీ పడ్డారు. అందుకని ఆయన ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టారట.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -