Rakul: రకుల్ ధ్యాసంతా దానిపైనే.. ఇప్పటికైనా మార్పు రాదా?

Rakul: తెలుగులో హీరోయిన్లకు హీరోలకు సమానమైన గుర్తింపు ఉంటుంది. మంచి నటన, గ్లామర్ తో ఆకట్టుకునే హీరోయిన్లకు తెలుగు జనాలు ఫిదా అవుతుంటారు. ఇలా ఒకప్పుడు బాగా గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోయిన్ కు.. ఇప్పుడు తెలుగులో అవకాశాలు తగ్గిపోగా ఆమె తమిళం మరియు బాలీవుడ్ లో అరకొర సినిమాలు చేస్తూ కాలం గడుపుతోంది.

 

టాలీవుడ్ లో ఒకప్పుడు వెలిగిపోయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో రకుల్ ప్రీత్ చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో ఈ అమ్మాయికి మంచి గుర్తింపు రాగా, ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు లభించాయి. తెలుగులో టాప్ లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగు సినిమాలు రావడం లేదు.

 

ప్రస్తుతం ఈ భామ తనకు స్టార్ డం తెచ్చిన తెలుగులో ఎలాంటి అవకాశాలు లేకపోగా, తమిళం మరియు హిందీలలో అరకొర సినిమాలు చేస్తోంది. అయితే ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వచ్చాయి. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత మామూలుగానే హీరోయిన్లు పెళ్లి చేసుకునే సంప్రదాయం కొనసాగుతుండగా.. రకుల్ కూడా త్వరలోనే పెళ్లిపీఠలు ఎక్కుతుందనే గుసగుసలు వినిపించాయి.

 

కానీ ఈ వార్తలను రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఖండించింది. తనకు మరిన్ని సినిమాలు చేయాలనే ఆకలి, మంచి క్యారెక్టర్లు పోషించాలనే కోరిక తీరలేదని రకుల్ వివరించింది. స్టార్ హీరోలతో మంచి మంచి సినిమాలు చేసినా కానీ అమ్మడికి మాత్రం ఇంకా మరిన్ని మంచి సినిమాలు, క్యారెక్టర్లు చేయాలనే కోరిక మాత్రం అలానే ఉందని, తన ధ్యాసంతా దాని మీదే ఉంది కానీ వేరే దేని మీదా లేదని రకుల్ స్పష్టం చేసింది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -